కన్నబిడ్డనే అమ్మాలనుకుంది.. | Hyderabad Woman Tries To Sell 8 Day Old Baby For ₹1 Lakh, Police Register Case | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డనే అమ్మాలనుకుంది..

Sep 10 2026 9:26 AM | Updated on Sep 10 2026 10:14 AM

newborn baby sale in hyderabad

హైదరాబాద్‌: నవజాత శిశువును విక్రయించడానికి యత్నించిన  మహిళపై కేసు నమోదు చేసిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో  చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ముఖ్తార్‌ బేగ్‌ (62) చిన్న కుమార్తెకు సంతానం లేకపోవడంతో చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలనుకున్నారు. ఈ నెల 7న ఓ అపరిచిత మహిళ 8 రోజుల వయసున్న శిశువుతో వచ్చింది.

 రూ.లక్షకు పాపను అమ్ముతానంది. ఆమె ప్రవర్తనపై అనుమానంతో ముఖ్తార్‌ బేగ్‌ తిరస్కరించారు. 8న రాత్రి సదరు మహిళ మళ్లీ వచ్చి తన పెద్ద కుమార్తె పెళ్లికి డబ్బులు కావాలంటూ రూ.30 వేలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. ఆమె ప్రవర్తనతో అనుమానించిన ముఖ్తార్‌ బేగ్‌.. వెంటనే ఎల్‌బీనగర్‌ పోలీసులకు సమాచారం అందించి, శిశువుతో సహా మహిళను పోలీసులకు అప్పగించారు. 

విచారణలో సదరు మహిళ బిహార్‌ రాష్ట్రం కిషన్‌గంజ్‌ జిల్లా దిఘల్‌బ్యాంక్‌ మండలం పలాస గ్రామానికి చెందిన లాల్మోన్‌ ఖాటూన్‌ (34), భర్త ఎండీ సుల్తాన్‌గా తేలింది. ప్రస్తుతం ఈమె పహాడీషరీఫ్‌లో కూలిపనులు చేస్తూ నివసిస్తోందని, విచారణలో ఆ మహిళే నవజాత శిశువుకు తల్లి అని నిర్ధారించారు. తల్లీబిడ్డలను రంగారెడ్డి జిల్లా  చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సంరక్షణ పర్యవేక్షణలో ఉంచినట్లు ఎల్‌బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌  వినోద్‌కుమార్‌ తెలిపారు.    

చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement