జగిత్యాలక్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని కుటుంబసభ్యులు, బంధువులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. అంతర్గాం గ్రామానికి చెందిన బందెల ప్రశాంత్ 15రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం సీతారాంపలి్లకి చెందిన కావ్యను ప్రేమవివాహం చేసుకున్నాడు.
యువతి కుటుంబసభ్యులు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. యువతి మేజర్ కావడంతో ప్రశాంత్‌తోనే పంపించారు. అప్పటినుంచి ప్రశాంత్, కావ్య అంతర్గాంలో కాపురం పెట్టారు. ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు, బంధువులు బుధవారం ఉదయం రెండు కార్లలో అంతర్గాం వచ్చి ప్రశాంత్ తల్లి భారతమ్మపై దాడిచేసి కావ్యను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. జరిగిన ఘటనను భారతమ్మ జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


