అధిక కట్నం తేవాలంటూ భార్యను హత్య చేసిన భర్త | Husband kills wife for demanding high dowry | Sakshi
Sakshi News home page

అధిక కట్నం తేవాలంటూ భార్యను హత్య చేసిన భర్త

Apr 2 2026 11:12 PM | Updated on Apr 3 2026 10:28 AM

Husband kills wife for demanding high dowry

సాక్షి,నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని ఇందిరమ్మ కాలనీలోని ఐదవ వీధిలో ఓ మహిళపై భర్త దారుణ హత్య జరిపిన ఘటన కలకలం రేపింది. 23 ఏళ్ల జర్సీ అనే యువతిని ఆమె భర్త వంశీ కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో అధిక కట్నం తేవాలని వాదనలతో భార్యపై వంశీ దాడి చేశాడు.అనంతరం సాయంత్రం సమయంలో ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకించే ప్రయత్నం కూడా చేసినట్లు సమాచారం.  

జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు సమాజంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.  

 

Advertisement
 
Advertisement
Advertisement