నడిరోడ్డుపై భార్యపై భర్త దాడి, కాపాడిన జనం, కానీ కోదాడలో | Bengaluru Husband attacks wife on busy road public saved her | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై భార్యపై భర్త దాడి, కాపాడిన జనం, కానీ కోదాడలో

May 8 2026 5:45 PM | Updated on May 8 2026 7:06 PM

Bengaluru Husband attacks wife on busy road public saved her

దేశంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో దాదాపు ఒకే సారి మహిళలపై జరిగిన హత్యా, హత్యాయత్నానికి సంబంధించిన ఘటనలు నెట్టింట చర్చకు దారి తీసాయి. తెలంగాణ లో కోదాడలో జరిగిన ఘటనలో, మహిళ ప్రాణాలు కోల్పోగా, బెంగళూరులోని మదనాయకనహళ్లిలో పట్టపగలే నడిరోడ్డుపై మాజీ భార్యపై కత్తితో దాడిచేసిన ఘటనలో భార్య తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీంతో  ప్రజలు ముఖ్యంగా  స్పందించాల్సిన తీరుపై చర్చ జరుగుతోంది.

ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, బీహార్‌కు చెందిన 35 ఏళ్ల నిందితుడు సంజయ్, తన భార్య సోనాలి ఇంటి నుంచి బయటకు వస్తుండగా అడ్డగించాడు. అతను హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చి, గుర్తు తెలియని దుండగుడిలా నటిస్తూ సోనాలి మెడపై కత్తి పెట్టి దాడి చేయడానికి ప్రయత్నించాడు.ఈ ఘటనను చూసిన ఒక యువకుడు వెంటనే జోక్యం చేసుకుని, సంజయ్‌ను అదుపులోకి తీసుకుని ఆ మహిళను రక్షించాడు. సోనాలి కేకలు విన్న స్థానికులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిపై దాడి చేసి, అనంతరం అతడిని మదనాయకనహళ్లి పోలీసులకు అప్పగించారు.

 గత కొన్ని నెలలుగా వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం అని సమాచారం. సంజయ్‌కు మద్యపాన వ్యసనం అలవాటు కావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, తిరిగి కలవడానికి సోనాలి నిరాకరించడమే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు. 

కోదాడ కేసు
తెలంగాణాలోని కోదాడ బస్టాండ్ దగ్గర  జరిగిన అందరూ చూస్తుండగా  భార్య శిరీషని కత్తితో పొడిచి చంపాడు భర్త మణిదీప్. ఈ రెండు ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయినాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

దీనిపై నెటిజన్లు భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిదని కొంతమంది అంటే, కానీ అప్రమత్తంగా ఉండాలి, మన ప్రాణాల మీదకు వస్తే ఎలా? అందుకే ముందుగా ఆయుధం చేతిలో ఉన్నవారి దృష్టిని మరలించి,  కలిసికట్టుగా, చాక చక్యంగా ఎదుర్కోవాలని కొందరు సూచించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలాంటి దుర్ఘటనలు కొన్నైనా ధైర్యంగా నిలువరించే గలిగితే, ఇలాంటి ఘోరాలకు తెగబడరని అభప్రాయపడుతున్నారు.  విభేదాలు ఎంత  తీవ్రమైనవైనా,  పరిష్కరించుకోవాలిగానీ, ఇలా హత్యలకు తెగబడకూదని హితవు పలుకుతున్నారు. 

ఇదీ చదవండి: క్రికెటర్ సూర్యకుమార్ లగ్జరీ ఇల్లు, కార్లు, విలువ ఎంతో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement