క్రికెటర్ సూర్యకుమార్ లగ్జరీ ఇల్లు, కార్లు, విలువ ఎంతో తెలుసా? | Cricketer SuryakumarYadavs Mumbai Home and networth deets Inside | Sakshi
Sakshi News home page

క్రికెటర్ సూర్యకుమార్ లగ్జరీ ఇల్లు, కార్లు, విలువ ఎంతో తెలుసా?

May 8 2026 5:12 PM | Updated on May 8 2026 6:50 PM

Cricketer SuryakumarYadavs Mumbai Home and networth deets Inside

క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (SKY),అతని భార్య, దేవిషా సూర్యకుమార్ యాదవ్  తమకు  ఆడబిడ్డ పుట్టిందన్న శుభవార్తను (మే 7, 2026న ) ఫ్యాన్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ పోస్ట్ క్యాప్షన్‌లో, "కిలకిల నవ్వులు, శుభాకాంక్షలు,నెరవేరబోయే కలలతో - మా ఆడబిడ్డకు స్వాగతం పలుకుతున్నాము" అంటూ  తమ క్తిగత జీవితంలో  సంతోషాన్ని ప్రకటించారు.  పాపాయి లేలేత  చేయిని పట్టుకున్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్  ముంబైలోని తన విలాసవంతమైన ఇంటి విశేషాలువైరల్‌గా మారాయి.

సూర్యకుమార్‌ పోస్ట్‌కు స్పందించిన పలువురు సెలబ్రిటీలు,తోటి క్రీడాకారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా  సారా టెండూల్కర్ నుండి రణవీర్ సింగ్ వరకు, సెలబ్రిటీలు అభినందన సందేశాలతో కామెంట్స్ సెక్షన్‌ను నింపేశారు.  ఈజంటకు  పెంపుడు జంతువులంటే చాలా ప్రేమ, ఇపుడిక  చిన్నారి బోసినవ్వులతో  కళ కళలాడనున్న లగ్జరీ అపార్ట్‌మెంట్‌ విశేషాలను  పరిశీలిద్దాం.

విశాలమైన లివింగ్ రూమ్ 
సూర్య ఇల్లు ఆధునికతకు, మినిమలిజంకు (సరళతకు) అద్దం పడుతుంది. ఇల్లంతా  వైట్‌ థీమతో  గోడలుప్రశాంతమైన లుక్‌లో  ఆకర్షణీయంగా అలరిస్తోంది. లివింగ్‌రూమ్‌ (Living Room)లో బ్లూ టోన్ సోఫా సెట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అక్కడక్కడ పసుపు రంగు టచ్‌తో ఇంటికి ఒక కొత్త కళ వచ్చిందనడంలో సందేహం లేదు.  వీటికి హ్యాండ్‌ మేడ్‌ కళాఖండాలు, అందమైన లైటింగ్ ,చక్కటి ఉడ్‌వర్క్ (Woodwork) ఇంటికి రాయల్‌ లుక్‌ని తీసుకొచ్చాయి. 

బాల్కనీలోనే జిమ్ 
ముంబై వంటి నగరంలో విశాలమైన బాల్కనీ ఉండటమే ఒక అదృష్టం. సూర్య తన బాల్కనీని చాలా తెలివిగా ఉపయోగించుకుని బాల్కనీ లోనే జిమ్‌ ఏర్పాటు చేసుకోవడం విశేషం. బాల్కనీలో కృత్రిమ గడ్డి పర్చిన ఈ బాల్కనీలోనే సూర్య వ్యాయామం చేయడానికి అవసరమైన డంబెల్స్, ఇతర పరికరాలు ఉన్నాయి. అంతేకాదు వ్యాయామం చేస్తూనే ముంబై తాజా గాలిని ఆస్వాదించేలా ఈ బాల్కనీ జిమ్‌ను రూపొందించారు.

క్రికెటర్‌ అంటే ఆ మాత్రం ఉండాలిగా
ఒక క్రికెటర్ ఇల్లు అంటే  ట్రోపీలకు, అవార్డులకు ప్లేస్‌ లేకపోతే ఎలా? అందుకే  సూర్య ఇంట్లో ఒక ప్రత్యేకమైన గోడపై ఆయన గెలుచుకున్న ట్రోఫీలు, క్రికెట్ జ్ఞాపకాలను ఎంతో అందంగా ప్రదర్శించారు. టెక్స్చర్డ్ వాల్స్ నేపథ్యం ఈ అవార్డులకు మరింత మెరుగులు దిద్దింది.


దీంతోపాటు,  రియల్ ఎస్టేట్‌లో  కూడా జంట భారీ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. 2025 మార్చిలో, సూర్య , దేవిషా  జంట  ముంబైలో రెండు అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు. వీటి విలువ సుమారు రూ. 21.1 కోట్లు అని సమాచారం సూర్య భార్య. మొత్తానికి, సూర్య ఇల్లు ఆధునిక హంగులతో, వెచ్చని వాతావరణంతో ఇప్పుడు తమ చిన్నారి రాకతో మరింత సందడిగా మారనుంది.

నెట్‌వర్త్‌ 
కాగా 2025 నాటికి సూర్యకుమార్ యాదవ్ అంచనా వేసిన నికర ఆస్తి విలువ దాదాపు రూ. 55- 65 కోట్లుగా అంచనా. 2026 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌  తరపున ఆడుతున్న  సూర్యకుమార్‌ ఆస్తులు మరింత పెరగనున్నాయి.  అతని ప్రస్తుత వార్షిక ఫ్రాంచైజీ జీతం సుమారు రూ. 16.35. మొత్తం ఐపీఎల్ సంపాదన దాదాపు రూ.72.60 కోట్లుగా అంచనా.

గ్యారేజీలో లగ్జరీ కార్లు, బైక్స్‌
విలాసవంతమైన సెడాన్‌లతో పాటు  ఇతర పవర్‌ఫుల్‌ కార్లు కూడా ఉన్నాయిమెర్సిడెస్-బెంజ్, ల్యాండ్ రోవర్ (రేంజ్ రోవర్ వెలార్‌తో సహా), ఆడి, BMW, పోర్షే,యు నిస్సాన్ వంటి కంపెనీల వాహనాలు. అలాగే సుజుకి, హార్లీ-డేవిడ్సన్ మరియు BMW సూపర్‌బైక్ విభాగం నుండి వచ్చిన బైక్‌లు న్నాయి.  అతని బ్యాటింగ్ లాగే, ఈ గ్యారేజీ కూడా  వైవిధ్యంగా ఉంటుందంటారు నిపుణులు.

20.5  మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించుకున్న సూర్య  ఒక్కో  డీల్‌కు రూ. 60–70 లక్షల మధ్య ఎండార్స్‌మెంట్ ఫీజును వసూలు చేస్తున్నట్లు సమాచారం. అతని పోర్ట్‌ఫోలియోలో రీబాక్, డ్రీమ్11, లెన్స్‌కార్ట్, జియోసినిమా, రాయల్ స్టాగ్, పింటోలా , బౌల్ట్ ఆడియో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement