భార్య రెండో పెళ్లి చిచ్చు.. భర్త ఆత్మహత్య! | Wifes Second Marriage Sparks Conflict Husband Ends His Life In Hyderabad | Sakshi
Sakshi News home page

భార్య రెండో పెళ్లి చిచ్చు.. భర్త ఆత్మహత్య!

May 15 2026 3:36 PM | Updated on May 15 2026 5:07 PM

Wifes Second Marriage Sparks Conflict Husband Ends His Life In Hyderabad

హైదరాబాద్‌:  తాను ఎంతగానో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కొన్నేళ్ల కాపురం తర్వాత రెండో పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని హయత్‌నగర్‌ పీఎస్‌ కోహెడ పరిధిలో చోటు చేసుకుంది.  తమకు పుట్టిన బిడ్డను సైతం భార్య అమ్మేసి మరీ రెండో పెళ్లి చేసుకోవడంతోనే తాను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు భర్త గోవర్థన్‌ వెల్లడించాడు. చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది.  

తన భార్య రెండో పెళ్లి చేసుకుందని, తమకు ఒక బాబు కూడా ఉన్నాడని ఆ వీడియోలో తెలిపాడు. నాలుగేళ్ల కాపురం తర్వాత ఆ బిడ్డను అమ్మేసి రెండో పెళ్లి చేసుకోవడాన్ని తాను భరించలేకపోతున్నానని, తనకు చావు తప్పితే మరొక మార్గం లేదని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ వీడియోలో వెక్కి వెక్కి ఏడ్చిన గోవర్థన్‌.. తనను మోసం చేసిన ఆమెను వదిలిపెట్టవద్దని కుటుంబ సభ్యులకు విన్నవించాడు. తాను చనిపోతున్నందుకు క్షమించాలంటూ కుటుంబ సభ్యులను కోరాడు. 

దీనిపై గోవర్థన్‌ తల్లి మాట్లాడుతూ.. వారికి పెళ్లియిందనే విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, బాబు పుట్టిన విషయం కూడా తమకు చెప్పలేదని, ఇప్పుడు వీడియో ద్వారా మాత్రమే వారికి పెళ్లైన విషయం, బాబు పుట్టిన విషయం తెలిసిందన్నారు. 

దాన్ని మాత్రం వదలొద్దు భార్య వదిలేయడంతో భర్త సూసైడ్

Advertisement
 
Advertisement
Advertisement