హీరోయిన్ భావన పెళ్లిరోజు నేడు (జనవరి 22). ఈ సందర్భంగా భర్త, నిర్మాత నవీన్‌తో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నిన్ను విసిగించడం ఎంత ఆనందంగా ఉంటుందో.. భవిష్యత్తులో కూడా నిన్ను ఇలాగే విసిగిస్తుంటాను.
మరో 365 రోజులు సంతోషంగా, ఉల్లాసంగా గడిపేద్దాం..
హ్యాపీ యానివర్సరీ అని క్యాప్షన్ జోడించింది.
ఒంటరి, హీరో, మహాత్మ సినిమాలతో తెలుగువారికి దగ్గరైన భావన మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసింది.


