సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో ప్రసన్న అనే వివాహిత తన భర్త సుధీర్‌రెడ్డిని చంపింది. చున్నీతో గొంతు నులిమి చంపినట్లు పోలీసుల ఎదుట ప్రసన్న అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


