భర్త, అతడి స్నేహితుల నుంచి ప్రాణహాని | Wife Alleges Husband Threats In annamayya | Sakshi
Sakshi News home page

భర్త, అతడి స్నేహితుల నుంచి ప్రాణహాని

Aug 18 2026 1:13 PM | Updated on Aug 18 2026 1:33 PM

Wife Alleges Husband Threats In annamayya

అన్నమయ్య జిలా:  భర్త, అతడి స్నేహితుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ ఓ యువతి మదనపల్లెలో ఎస్పీ ధీరజ్‌ కునిబిల్లికి పిజిఆర్‌ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు.. లక్కిరెడ్డిపల్లి మండలంలోని మద్దిరేవులు అప్పలరాజుగారిపల్లికి చెందిన రామరాజు కాంట్రాక్టు లైన్మెన్‌గా పని చేస్తున్నాడు.

 అతడి భార్య లలిత 2014లో ఇద్దరు పిల్లలను పుట్టింటిలో వదిలి బతుకు దెరువు కోసం కువైట్‌కు వెళ్లి తిరిగి వచ్చింది. విదేశాల నుంచి తెచ్చిన డబ్బు, బంగారం కోసం భర్త తనను చంపాలని చూస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్తతో పాటు అతడి స్నేహితులు కూడా తనపై దాడులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకున్నారు. బాధితురాలి ఫిర్యాదును ఎస్పీ స్వీకరించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement