సాక్షి, అమరావతి: ఈ నెల 13 నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 15 నాటికి బంగాళాఖాతంలో అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది.