హిందూమహిళ వారసత్వ ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు | Husband Gets No Share In Parental Property Inherited By Wife: Andhra Pradesh High Court | Sakshi
Sakshi News home page

హిందూమహిళ వారసత్వ ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు

Apr 1 2026 6:12 AM | Updated on Apr 1 2026 6:12 AM

Husband Gets No Share In Parental Property Inherited By Wife: Andhra Pradesh High Court

సంతానం లేకుండా మరణిస్తే ఆ ఆస్తి తిరిగి తండ్రి వారసులకే చెందుతుంది  

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు తీర్పు  

సాక్షి, అమరావతి: హిందూమహిళకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపై ఆమె భర్తకు ఎలాంటి హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మహిళ సంతానం లేకుండా చనిపోతే ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని చెప్పింది. తన సోదరి శ్రీవిరిత మరణం నేపథ్యంలో ఆమెకు వారసత్వంగా తమ నాయనమ్మ నుంచి సంక్రమించిన భూమి తాలూకు రెవెన్యూ రికార్డుల్లో తన పేరును నమోదు చేయాలని కోరుతూ దేవిక మానస దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తూ రెవెన్యూ డివిజినల్‌ ఆఫీసర్‌ (ఆర్‌డీవో) జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమరి్థంచింది. ఆర్‌డీవో ఉత్తర్వులను రద్దుచేస్తూ జాయింట్‌ కలెక్టర్‌ జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టింది. జాయింట్‌ కలెక్టర్‌ ఉత్తర్వులను రద్దుచేసింది. రికార్డుల్లో దేవిక మానస పేరు చేర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు చెప్పారు.  

మనుమరాళ్లకు ఆస్తి ఇచ్చిన నాయనమ్మ 
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకాయమ్మ తన మనుమరాలు (కుమారుడు దత్తాత్రేయ కుమార్తె) శ్రీవిరితకు 1.50 ఎకరాల భూమిని 2002లో గిఫ్ట్‌డీడ్‌ కింద ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు రికార్డుల్లో శ్రీవిరిత పేరు మీద మార్పులు చేశారు. 2005లో శ్రీవిరిత మరణించడంతో ఆ గిఫ్ట్‌డీడ్‌ను వెంకాయమ్మ 2007లో రద్దుచేశారు. ఆ భూమిని 2011లో మరో మనుమరాలు దేవిక మానసకు గిఫ్ట్‌డీడ్‌ ద్వారా ఇచ్చిన వెంకాయమ్మ 2012లో కన్నుమూశారు. అనంతరం ఆ 1.50 ఎకరాల భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తనపేరు చేర్చాలని దేవిక మానస తహసీల్దార్‌ను కోరారు. దీనికి శ్రీవిరిత భర్త బదిరెడ్డి నాగవీరవెంకట శ్రీరామదొర అభ్యంతరం తెలిపారు.

ఆ భూమి తన భార్యదని, దానిపై తనకే హక్కులున్నాయని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్‌ ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సవాలు చేస్తూ దేవిక మానస రెవెన్యూ డివిజినల్‌ ఆఫీసర్‌ (ఆర్‌డీవో)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ఆర్‌డీవో.. తహసీల్దార్‌ ఉత్తర్వులను తప్పుబట్టి, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని 2017లో ఆదేశించారు. దీనిపై శ్రీరామదొర జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) ముందు రివిజన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2017లో ఆర్డీవో జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టారు. ఒకసారి గిఫ్ట్‌డీడ్‌ ఇచ్చిన తరువాత దాన్ని రద్దుచేయడానికి వీల్లేదని, సివిల్‌ కోర్టు ద్వారా మాత్రమే ఆ డీడ్‌ను రద్దుచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement