ఆలుమగల స్ఫూర్తి గాథ.. జీవితాన్ని జయించిన ప్రేమ కథ..! | This is the story of Deng Youcai from China | Sakshi
Sakshi News home page

ఆలుమగల స్ఫూర్తి గాథ.. జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!

Apr 11 2026 6:18 PM | Updated on Apr 11 2026 6:44 PM

This is the story of Deng Youcai from China

జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!.. ఇదొక శీర్షిక మాత్రమే కాదు.. ఆలుమగలకు ఆదర్శమైన ప్రధాన విషయం. ప్రస్తుత రోజుల్లో  భార్యా భర్తల సంబంధాల్లో ప్రేమలు ఎంతవరకూ ఉంటున్నాయనే దానికి ఈ తరహా ఘటనలు ప్రేరణగా నిలుస్తాయి. ఒకరికోసం ఒకరు జీవించే క్షణాలు చాలా అల్పమై స్వల్పమైపోయిన ఈ రోజుల్లో నిజంగా ఇదొక స్ఫూర్తిగానే నిలుస్తుంది. 

ఏదో యాంత్రిక జీవితంలో ముందుకు సాగుతూ.. ఏదో బ్రతికేస్తున్నాం అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తేనే ఆ దాంపత్యానికి అర్ధం ఉంటుందనేది తాజా ఎపిసోడ్‌ చెప్పకనే చెప్పేసింది. 

ఇలా ఒకరికోసం ఒకరు అనే జంట ఉండటమే ఇప్పుడు వార్త అయ్యింది.  వార్తా వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన డెంగ్‌ యుకై అనే మహిళకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నడవలేని స్థితి. బెడ్‌కే పరిమితమై కృంగిపోయింది. తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా భర్తను ప్రాధేయ పడింది. భర్తకు తనవల్ల కష్టం రాకూడదని ఆమె చనిపోవాలని అనుకుంది. తాను చనిపోతే భర్త సుఖంగా ఉంటాడని భావించింది. 

భర్త నో అన్నాడు.  ‘నేను ఉండగా నీకేం కాదు’ అన్నాడు,. భార్యకు అండగా నిలబడ్డాడు. విధితో పోరాడాడు. తన సంకల్పం ఎంత గట్టిదో చూపించాడు. భార్యను పూర్వపు స్థితికి తీసుకురావడానికి సుమారు రూ. 2 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడు. అదే సమయంలో  ప్రతీ రోజూ ప్రతీ క్షణం భార్య అలా బెడ్‌కే పరిమితమైన భార్య ముందు డ్యాన్స్‌లు చేస్తూ నవ్వించే యత్నం చేశాడు. చివరకు ఆమె కోలుకుంది. మళ్లీ తన పాత రోజుల్లోకి వచ్చేసింది. ప్రేమ శక్తితో భార్య తిరిగి జీవం పోసుకుంది.. లౌకిక జీవితాన్ని మళ్లీ చూడసాగింది. 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement