భార్యను రూ. 50 వేలకు అమ్మేశాడు.. 10 రోజులు నరకం | Gujarat man sells wife for Rs 50k assaulted repeatedly for 10 days | Sakshi
Sakshi News home page

భార్యను రూ. 50 వేలకు అమ్మేశాడు.. 10 రోజులు నరకం

May 28 2026 11:36 AM | Updated on May 28 2026 12:36 PM

Gujarat man sells wife for Rs 50k assaulted repeatedly for 10 days

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నూరేళ్లు తోడు ఉంటానని ప్రమాణం  చేసిన కట్టుకున్న భర్తే  12 ఏళ్ల వివాహ బంధానికి తూట్లు పొడిచాడు. భార్యను స్నేహితులకు రూ. 50,000కు అమ్మేశాడు. పైగా ఏమీ తెలియనట్టు తన భార్య మిస్సింగ్‌ అంటూ ఫిర్యాదు చేశాడు.  ఈ ఘటనలో పోలీసులే నివ్వెరపోయే షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి. 

సాధారణంగా మిస్సింగ్‌ ఫిర్యాదుగా మొదలై, ఉత్తర గుజరాత్‌లోని పాలన్‌పూర్ పోలీసులను  నివ్వెరపర్చే మానవ అక్రమ రవాణా కేసును వెలికితీసేలా చేసింది. పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల ప్రారంభంలో భర్తే స్వయంగా పాలన్‌పూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ దర్యాప్తులో ఈ దిగ్భ్రాంతి కర విషయం వెలుగు చూసింది. 

డీఎస్‌పీ జిగ్నేష్ గమిత్ ప్రకారం, నిందితుడు నిఖేష్‌ తన భార్య పాలన్‌పూర్ నగరం నుండి అదృశ్యమైందని పేర్కొంటూ భర్త మే 11న ఫిర్యాదు చేశాడు. అయితే, ఫిర్యాదు చేసిన రెండు రోజులకే అతను కూడా అదృశ్యమయ్యాడు. అతను కనబడకపోవడంతో, అతని తండ్రి పాలన్‌పూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో మరో అదృశ్య ఫిర్యాదును నమోదు చేశారు. ఈ వరుస  ఫిర్యాదులు  మరిన్ని అనుమానాలను రేకెత్తించడంతో దర్యాప్తును ముమ్మరం చేశామని తెలిపారు.ఆ తర్వాత భర్త ఆచూకీ గుర్తించి ఆరా తీశారు. అతను నేరాన్ని అంగీకరించాడు. అతడి సమాచారం ఆధారంగా భార్యను గుర్తించాయి.నిందితుడు భర్త . తన భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే స్నేహితులైన సంజయ్ ఠాకూర్, అశోక్ ఠాకూర్, సచిన్ దర్బార్‌ల సహాయంతో అమ్మేసినట్లు ఒప్పుకున్నాడు.

చివరకు నిందితుల చెర నుంచి బాధితురాలిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. తనను అమ్మేసిన తర్వాత ఒకచోట బంధించి, నిరంతరం లైంగిక దాడి చేశారని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. అంతేకాకుండా, తన బంగారు ఆభరణాలను లాక్కొని అమ్మేశారని తెలిపింది. అలాగే, థరాడ్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన మరో ముగ్గిరికి ఆమెను రూ. 1.5 లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రధాన నిందితుడు నిఖేష్ పటేల్‌కు ఇదివరకే పెళ్లయిందని, ఇతర మహిళలను లోబరుచుకోవడం, కిడ్నాప్ చేయడం వంటి నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో మహిళను ఇంటికి తీసుకురావాలని చూస్తూ తనను హింసించేవాడని కూడా బాధితురాలు ఆరోపించింది. కేవలం ఈ కారణంతోనే, అతను తన స్నేహితులతో కలిసి కుట్ర పన్నాడని  పోలీసుల ముందు వాపోయింది. 

ఇదీ చదవండి: అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపు

Advertisement
 
Advertisement
Advertisement