బొల్లారంలో దారుణం.. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి | Husband And Wife Attacked In Bollaram | Sakshi
Sakshi News home page

బొల్లారంలో దారుణం.. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి

May 31 2026 9:20 AM | Updated on May 31 2026 10:18 AM

Husband And Wife Attacked In Bollaram

సాక్షి, హైదరాబాద్‌: బొల్లారంలో దారుణం జరిగింది. బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో దుండగులను భర్త అడ్డుకున్నారు. దీంతో ఆయన భార్య మీనాను దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య  చేయగా.. భర్త అనిల్‌ కుమార్‌పై కత్తులతో దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన అనిల్‌ కుమార్‌ పరిస్థితి విషమం ఉంది. ఆసుపత్రికి తరలించారు. పరారైన నిందితులు కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. బిహార్‌కు చెందిన దంపతులు బొల్లారంలో నివాసం ఉంటున్నారు. షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement