అగ్నివీర్‌ నియామక ర్యాలీ | Agniveer Recruitment Rally From Aug 29 | Sakshi
Sakshi News home page

అగ్నివీర్‌ నియామక ర్యాలీ

Jul 17 2026 6:01 AM | Updated on Jul 17 2026 6:09 AM

Agniveer Recruitment Rally From Aug 29

ఆగస్టు 29న రక్షణరంగ ఉద్యోగాల భర్తీ  

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లోని ఈఎంఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌) 1 సెంటర్‌ ఆధ్వర్యంలో యూనిట్‌ హెడ్‌క్వార్టర్‌ కోటా (యూహెచ్‌క్యూ) కింద అగ్నివీర్‌ నియామక ర్యాలీ ఆగస్టు 29న నిర్వహించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ సైనికులు, మాజీ సైనికుల సోదరులు, సేవలందిస్తున్న సైనికుల కుమారులు, యుద్ధవీరుల భార్యలు, వితంతువులకు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం కల్పించారు.  

అగ్నివీర్‌ నియామకాలు:  అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు.  
అగ్నివీర్‌ అర్హతలు: అభ్యర్థుల వయస్సు 17 – 22 సంవత్సరాలు  
అగ్నివీర్‌ టెక్నికల్‌: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌తో ఇంటర్మీడియెట్‌. సైన్స్‌లో కనీసం 50 శాతం మార్కులు లేదా సంబంధిత ఐటీఐ, డిప్లొమా, వృత్తి విద్యార్హతలు  

అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ (చెఫ్‌): 10వ తరగతి ఉత్తీర్ణత ఈత, డైవింగ్, వాలీబాల్‌ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఓపెన్‌ కేటగిరీలో నియామకాలు 
ప్రదేశం: అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 29 ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లోని 1 ట్రైనింగ్‌ బెటాలియన్, మిల్కా సింగ్‌ స్టేడియం, 1 ఈఎంఈ సెంటర్‌ 
పూర్తి వివరాల కోసం: హెడ్‌క్వార్టర్స్, 1 ఈఎంఈ సెంటర్, బొల్లారం, సికింద్రాబాద్‌– 500 010 లో స్వయంగా, 040–27863016 ఫోన్‌ నంబర్‌ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే  www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అధికారులు సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement