సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఆయన ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి పులివెందుల వాసులతో ఈ వేడుకల్లో పాల్గొంటారు.




