బ్యాంక్‌ల్లో ఇబ్బందులా?, ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయండిలా.. | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ల్లో ఇబ్బందులా?, ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయండిలా..

Published Sun, May 26 2024 7:57 AM

How to File a Complaint with the Banking Ombudsman in 2024?

మీరు బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారా? సమస్య పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయండి అని అంటోంది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ).  

బ్యాంక్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, దానిని బ్యాంక్ బ్రాంచ్ అధికారులు లేదా దాని ప్రధాన కార్యాలయం పరిష్కరించలేకపోతే, మీరు ఆర్‌బీఐలో బ్యాంక్‌పై ఫిర్యాదు చేయడానికి ఈ పద్దతిని ఎంపిక చేసుకోవచ్చు.

ఫిర్యాదులను స్వీకరించేందుకు
అటువంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆర్బీఐ బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్‌ ముఖ్య ఉద్దేశం బ్యాంకులు అందించే కొన్ని సేవలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం బ్యాంక్ కస్టమర్‌ల కోసం ఒక వేగంగా చర్యలు తీసుకునే వేదిక.

ఎటువంటి రుసుము లేకుండా
బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2006లోని క్లాజ్ 8 ప్రకారం (జూలై 1, 2017 వరకు సవరించిన ప్రకారం) ఖాతాదారుల ఫిర్యాదులను దాఖలు చేయడానికి, పరిష్కరించడానికి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ఎటువంటి రుసుమును వసూలు చేయరు అని ఆర్‌బీఐ తరచుగా పేర్కొంది.

ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్  
బ్యాంక్‌ ఖాతాదారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నా.. బ్యాంక్‌ తరుపు లోపాలుంటే ఖచ్చితంగా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయొచ్చు. సమస్య ఉందని పరిష్కారం కోరినా బ్యాంకులు పట్టించుకోకపోతే, సంబంధిత బ్యాంకు మీ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఒక నెలలోపు బ్యాంకు నుండి ప్రత్యుత్తరం రాకుంటే, బ్యాంక్ ఫిర్యాదును తిరస్కరించినట్లయితే  మీరు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు https://rbi.org.in/Scripts/Complaints.aspx ఈ లింక్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.  

Advertisement
 
Advertisement
 
Advertisement