Konda Surekha: రేవంత్‌కు ఫిర్యాదు.. ఖర్గేకు లేఖ | Telangana Ministerial Clash: Konda Surekha Complains to CM Revanth Reddy Over Tender War | Sakshi
Sakshi News home page

Konda Surekha: రేవంత్‌కు ఫిర్యాదు.. ఖర్గేకు లేఖ

Oct 11 2025 11:14 AM | Updated on Oct 11 2025 12:05 PM

T Ministers Clashes: Konda Surekha Complaints Minister to CM Full Details

సాక్షి, హైదరాబాద్‌: అడ్లూరి-పొన్నం వివాదం మరువక ముందే.. తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య లొల్లి మొదలైంది(Telangana Ministers Clash). దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్‌ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

మేడారం టెండర్ల విషయంలో ఈ ఇద్దరు మంత్రులకు వార్‌ మొదలైందని తెలుస్తోంది. ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్‌.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అయితే.. తన శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనులను తన మనిషికి ఇప్పించుకునేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మంత్రి కొండా సురేఖ ఆరోపణ. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ నివాసానికి వెళ్లిన ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. 

ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు పలుకీలక అంశాలతో లేఖ రూపేణా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని ప్రచారం బలంగా వినిపిస్తోంది(Konda Surekha Complaint Ponguleti). 

ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ తనపై అనుచిత వ్యాఖ్య చేశారంటూ అడ్లూరి లక్ష్మణ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. పొన్నం క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారాయన. ఈ క్రమంలో సీఎం సూచనతో.. టీపీపీసీ చీఫ్‌ మధ్యవర్తిత్వం వహించడంతో పొన్నం క్షమాపణలు చెప్పగా ఆ పంచాయితీ ముగిసింది.

ఇదీ చదవండి: కోర్టు ఆదేశాలంటే లెక్కే లేదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement