స్నేహంగా మెలిగితే.. పెళ్లి చేసుకోవాలని వేధింపులు | young woman Complaint on police station | Sakshi
Sakshi News home page

స్నేహంగా మెలిగితే.. పెళ్లి చేసుకోవాలని వేధింపులు

Jan 20 2025 9:39 AM | Updated on Jan 20 2025 11:41 AM

young woman Complaint on police station

వెంగళరావునగర్‌: స్నేహంగా మెలిగినందుకు యువతిని ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలంటూ వేధించిన సంఘటన మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం... జగిత్యాల ప్రాంతానికి చెందిన యువతి స్థానిక మధురానగర్‌ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్‌ జాబ్‌ చేస్తుంది. ఈ క్రమంలో బోరబండలో ఉండే రఘువంశీతో పరిచయం ఏర్పడింది. ఒకే జిల్లాకు చెందిన వారు కావడంతో చనువుగా ఉండటంతోపాటు పలు దేవాలయాలకు కలిసి వెళ్లారు. 

ఆ సమయంలో కొన్ని ఫొటోలను సైతం కలిసి దిగారు. అయితే కొన్ని రోజుల తరువాత రఘువంశీ సదరు యువతిని పెళ్లిచేసుకోవాలని కోరాడు. అందుకు యువతి నేను స్నేహితురాలిని మాత్రమేనని పెళ్లిచేసుకోవడం కుదరదని తేలి్చచెప్పింది. దీంతో ఇరువురూ కలిసి దిగిన ఫొటోలను బంధువులకు పంపడంతోపాటు యువతి గురించి చెడు ప్రచారం చేస్తానని బెదిరించసాగాడు. వేధింపులు తట్టుకోలేక యువతి మధురానగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement