
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన పీఏ చంద్రశేఖర్‌పై టీడీపీ నేతలే జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది.
థామస్ పీఏ చంద్రశేఖర్‌ను విధులు నుంచి తొలగించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్‌లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ నాయకులంతా కలిసిగట్టుగా వెళ్లి జిల్లా కలెక్టరేట్‌లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే థామస్ పీఏ చంద్రశేఖర్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీడీపీ నేతలు కోరారు.

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, టీడీపీ పార్టీ వ్యవహారాల్లో దూరి రాజకీయాలు చేస్తున్నాడు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీలో ప్రతి మండలానికి తన వర్గాన్ని ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నాడు’’ అంటూ టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.
‘‘టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే పీఏ చంద్రను వెంటనే తొలగించాలి. అతని ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరుతున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏ నలుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకుని కోట్లు దోచుకుంటున్నారు’’ అంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది.