నాకు ప్రాణహాని ఉంది.. | Case Filed On Lady Aghori In Mangalagiri Police Station, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

నాకు ప్రాణహాని ఉంది..

Mar 27 2025 7:17 AM | Updated on Mar 27 2025 10:01 AM

Case Filed On Lady Aghori in Mangalagiri Police Station

అఘోరితో కలిసి పోలీసులను ఆశ్రయించిన యువతి  

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి తెలిపింది. మంచిర్యాల జిల్లాకు చెందిన అఘోరితో కలిసి ఆమె మంగళవారం రాత్రి నెన్నెల పోలీసులను ఆశ్రయించింది. అనంతరం యువతి అఘోరి స్వగ్రామమైన నెన్నెల మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి వెళ్లింది. 

బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న తమ కూతురు శ్రీవర్షిణికి అఘోరి మాయమాటలు చెప్పి వెంట తిప్పుకుంటోందని, తమ కూతురిని తమకు అప్పగించాలని మంగళగిరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, తాను మే జర్‌నని తన ఇష్ట ప్రకారమే అఘోరి వెంట వ చ్చానని, ఎవరూ బలవంతం చేయలేదని యు వతి పోలీసులకు తెలిపింది. తాను కూడా అఘోరి దీక్ష తీసుకున్నానని శ్రీవర్షిణిలో చెప్పినట్లు ఎస్సై ప్రసాద్‌ పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement