సాక్షి, గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఏఐ టెక్నాలజీ సాయంతో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు (మంగళవారం) గుంటూరు ఏఎస్‌పీని కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్‌ను కించపరుస్తూ ఏఐ వీడియోలు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిలో భాగంగా కేందమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పైన అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ పాత్రలు వేసి నటించేవారిపైనా చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఫ్యాక్టరీ పెట్టారని ఈ విషయమై గతంలో కూడా ఫిర్యాదులిచ్చామన్నారు. తన ఇంటిపై జరిగిన దాడిలో పెమ్మసానే ప్రధాన కుట్రదారుడని ఆయన సినిమా చూపిస్తానని హెచ్చరించన తర్వాతే తనపై తన ఇంటిపై దాడి జరిగిందన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారని ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేస్తే తమపై కేసులా అని ప్రశ్నించారు. రోడ్లకు అడ్డంగా టెంట్‌లు వేసిన టీడీపీ నేతలపై కేసులు కట్టరా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులకు ఒక న్యాయం వైఎస్సార్సీపీ నేతలకు మరోక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఏసీపీకి మూడు ఫిర్యాదులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.


