Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Government Arranged SIT to probe Poll violence in Andhra Pradesh
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్‌ ఏర్పాటు

సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో కూడిన సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.సిట్‌లో సభ్యులుగా.. ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు..వీ శ్రీనివాసరావు, రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జి ఐ శ్రీనివాస్, ఎన్‌ ప్రభాకర్, శివ ప్రసాద్‌లు సిట్ సభ్యులుగా నియామకమయ్యారు.కాగా ఎన్నికల వేళ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్రపైన విచారణ జరపనుంది. రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu
ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు

సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్‌ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం​ లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్‌ క్యాంపెన్‌ చేశారు. జగన్‌ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం​ లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.‘‘కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్‌ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

KSR Comments On TDP Attacks In Elections
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ

ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్‌గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్‌ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్‌సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్‌సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ను తమ ట్రాప్‌లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్‌సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్‌సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Vidya Vasula Aham Movie Review And Rating In Telugu
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ

టైటిల్‌: విద్య వాసుల అహంనటీనటులు: రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌, అవసరాల శ్రీనివాస్‌, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్‌ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి తదితరులునిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి దర్శకత్వం: మణికాంత్‌ గెల్లిసంగీతం: కళ్యాణి మాలిక్‌ఎడిటర్‌ : అఖిల్‌ వల్లూరిఓటీటీ స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా(మే 17 నుంచి)ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం(మే 17) రిలీజ్‌ అయిన సినిమానే ‘విద్య వాసుల అహం’. రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. దానికి తోడు థియేటర్‌ సినిమా మాదిరి ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘విద్య వాసుల అహం’ కాస్త హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వాసు(రాహుల్‌ విజయ్‌) ఓ సంస్థలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌గా పని చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్లు బలవంతం చేసినా..అతను మాత్రం ఇంట్రెస్ట్‌ చూపించడు. మరోవైపు విద్య(శివాని) కూడా అంతే. పెరెంట్స్‌ పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా.. ఆమె దృష్టి మాత్రం ఉద్యోగం మీదనే ఉంటుంది. ఓ గుడిలో విన్న ప్రవచనాలతో అటు రాహుల్‌కి, ఇటు విద్యకి పెళ్లిపై ఇంట్రెస్ట్‌ కలుగుతుంది. పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇద్దరి పేరెంట్స్‌ ఆ పనిలోనే ఉంటారు. అలా ఓ పెళ్లిళ్ల బ్రోకర్‌ ద్వారా ఇద్దరికి సంబంధం కుదురుతుంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరికి ఉన్న ఈగోల కారణంగా మొదటి రాత్రే గొడవలు మొదలవుతాయి. మరి ఆ గొడవలు ఎక్కడికి దారి తీశాయి? ఇద్దరికి ఉన్న ఆహం ఎలాంటి విబేధాలను తెచ్చిపెట్టింది? ఏ విషయంలో విరిద్దరి మధ్య గొడవలు జరిగాయి? గొడవ జరిగినప్పుడల్లా ఇద్దరిలో ఎవరు తగ్గారు? ఉద్యోగం కోల్పోయిన వాసుకి విద్య సపోర్ట్‌గా నిలిచిందా లేదా? విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా వివాహ బంధాన్ని ఎంజాయ్‌ చేస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పెళ్లి సబ్జెక్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా కాస్త ఎంటర్‌టైనింగ్‌గా తీస్తే చాలు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. దర్శకుడు మణికాంత్‌ ఆ పనే చేశాడు. ఎంచుకున్న కథ రొటీనే అయినా.. చాలా ఎంటర్‌టైనింగ్‌ కథనాన్ని మలిచాడు. కథంతా క్యూట్‌గా సాగిపోతుంది. ఎక్కడా కూడా బోర్‌ కొట్టదు. ‘పరస్పరం గౌరవం వివాహానికి పునాది’ అనే సందేశాన్ని చాలా వినోదభరితంగా ఇచ్చాడు. అహంతో కూడిన ప్రేమ‌క‌థ‌లోని భావోద్వేగాల‌ను తెరపై చక్కగా పండించాడు.పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో కథనం సాగుతుంది. ఫస్టాప్‌లో కొత్తగా పెళ్లైన జంట ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాల్లో ఈగోలకి వెళ్లి ఎలా గొడవ పడతారు? అనేది వినోదాత్మకంగా చూపించాడు. ఇక సెకండాఫ్‌లో పెళ్లయిన తర్వాత వచ్చే సమస్యలు.. ఇగోల కారణంగా వచ్చే ఇబ్బందలను చూపించారు. భార్యభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. వివాహం బంధం బలంగా ఉండాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయిన ప్రతి జంట..ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతుంది. అయితే కథలో మాత్రం కొత్తదనం ఉండదు. కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఓటీటీ సినిమానే కదా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలను సింపుల్‌గా చుట్టేశారనే ఫీలింగ్‌ కలుగుతుంది. స్క్రీప్‌ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేదేమో. డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్‌ చేయడం సినిమాకు ప్లస్‌ పాయింట్‌. ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవుతుంది కాబట్టి ఎంటర్‌టైన్‌ కావడానికి వీకెండ్‌లో ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఎవరెలా చేశారంటే..ఈ జనరేషన్‌ భార్య భర్తలుగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది.ఈగోస్‌తో ఇద్దరి మధ్య జరిగే గొడవలు నవ్వులు పూయిస్తాయి. శివానీ శారీలోనే కనిపిస్తూనే కావాల్సిన చోట అందాలను ప్రదర్శించింది. ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా రాహుల్‌ విజయ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్‌, లక్ష్మీ దేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డితో పాటు తనికెళ్ల భరణి, శ్రీనివాస్‌ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మీ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.కల్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Swati Maliwal Taken To Arvind Kejriwal Home As Cops Probe Assault Charge
కేజ్రీవాల్‌ నివాసానికి స్వాతి మలీవాల్‌.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్?

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్‌ నివాసంలోని డ్రాయింగ్‌ రూంలో సీఎం కోసం ఆప్‌ ఎంపీ ఎదురుచూస్తుండగా.. బిభవ్‌ కుమార్‌ అక్కడికి వెళ్లి, ఆమెతో అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లు స్వాతి మలీవాల్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బిభవ్‌ కుమార్‌ను నిందితుడిగా చేర్చి దర్యాప్తు జరుపుతున్నారు.దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు మలీవాల్‌ను ఆమెపై దాడి జరిగిన సీఎం కేజ్రీవాల్‌ నివాసానికి శుక్రవారం సాయంత్రం తీసుకెళ్లారు. మే 13న జరిగిన క్రైం సీన్‌ను రీక్రియెట్‌ చేయడానికి సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఆప్‌ ఎంపీని కేజ్రీవాల్‌ ఇంటికి తీసుకెళ్లే ముందు అయిదుగురు ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి ఢిల్లీ పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లింది. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) అంజిత చెప్యాల నాయకత్వంలో నలుగురు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సీఎం ఇంటి నుంచి పలు ఆధారాలను సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. అనంతరం ఫోరెన్సిక్ బృందం కేజ్రీవాల్‌ నివాసం నుంచి తిరిగి వెళ్లిపోయింది.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Arvind Kejriwal's residence as police is expected to recreate what happened with her here on 13th May pic.twitter.com/bM7w8kygO3— ANI (@ANI) May 17, 2024 కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడి చేశారని స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆప్‌ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్‌ సంచలన ఆరోపణలుదాడి ఆరోపణల నేపథ్యంలో మలీవాల్‌కు నేడు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముఖంపై అంతర్గత గాయాలు అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు దాడికి ముందు కేజ్రీవాల్‌ నివాసంలో మలీవాల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించినట్లు వీడియోలో కనిపిస్తోంది.Analysing the #SwatiMaliwal case through this video:If this video was recorded before the alleged assault, there's no way she could have been assaulted the way she has written in the FIR after this, in presence of so many security staff including a female staff. If this video… pic.twitter.com/RNnmzYkC04— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 17, 2024దీనిపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రతిసారిలాగే.. ఈసారి కూడా ఈ రాజకీయ హిట్‌మ్యాన్‌ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని విమర్శించారు. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని మండిపడ్డారు. ఒకరిని కొడుతున్న వీడియో ఎవరు తీస్తారు..? ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే.. నిజం వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆప్ అధినేత ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. దీంతో కేజ్రీవాల్‌ మౌనంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.#WATCH | AAP MP Swati Maliwal leaves from Delhi CM Arvind Kejriwal's residence after recreation of May 13 incident by Police pic.twitter.com/8n3K6sAbZ5— ANI (@ANI) May 17, 2024

SRH Pat Cummins Plays Gully Cricket With School Kids in Hyderabad Viral
SRH: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ చేసిన పనికి అభిమానులు ఫిదా

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ చేసిన పనికి ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘‘నువ్వు చాలా మంచోడివి కమిన్స్‌ మామా.. మా హృదయాలు గెలుచుకున్నావు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇదంతా కేవలం.. సన్‌రైజర్స్‌ను ప్లే ఆఫ్స్‌నకు చేర్చినందుకు మాత్రమే అనుకుంటే పొరపడినట్లే! ఆరెంజ్‌ ఆర్మీ ఆఖరిసారిగా 2020లో ప్లే ఆఫ్స్‌ చేరింది.ఆ తర్వాత గత మూడేళ్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీపడింది. అయితే, ఐపీఎల్‌-2024లో మాత్రం పూర్తిగా సీన్‌ రివర్స్‌ అయింది. ఇప్పుడు టాప్‌-2 రేసులోనూ సన్‌రైజర్స్‌ముందు వరుసలో ఉంది.టికెట్‌ కన్ఫామ్‌ఆస్ట్రేలియా సారథి, 2023 వన్డే వరల్డ్‌కప్‌ విజేత ప్యాట్‌ కమిన్స్‌, కొత్త కోచ్‌ డానియల్‌ వెటోరి రాకతో ఆరెంజ్‌ ఆర్మీ ఇలా విజయవంతమైన పంథాలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ బెర్తుపై కన్నేసిన కమిన్స్‌ బృందం గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దు కావడంతో టికెట్‌ కన్ఫామ్‌ చేసుకుంది.ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తర్వాత టాప్‌-4లో అడుగుపెట్టిన మూడో జట్టుగా నిలిచింది. లీగ్‌ దశలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఈ ఘనత సాధించింది. ఆ మ్యాచ్‌లోనూ గెలిస్తే టాప్‌-2కి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కమిన్స్‌ఇదిలా ఉంటే.. రైజర్స్‌ను ప్లే ఆఫ్స్‌ చేర్చిన ఉత్సాహంలో ఉన్న కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కెప్టెన్‌ సాబ్‌.. అక్కడి పిల్లలతో సరదాగా క్రికెట్‌ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. విద్యార్థుల ముఖాల్లో నవ్వులు నింపినందుకు సంతోషంగా ఉందంటూ కమిన్స్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. కాగా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటి దాకా ఆడిన 13 మ్యాచ్‌లలో ఏడు గెలిచింది. ఒకటి రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. కమిన్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటి దాకా 14 వికెట్లు వికెట్లు పడగొట్టాడు. కాగా 2024 వేలంలో సన్‌రైజర్స్‌ అతడిని రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.Pat Cummins at zphs . You hav my heart champ 😭😭❤️❤️ @patcummins30 #ipl pic.twitter.com/ZReUDCUSYc— SURYA BHAI 🚩 (@Surya_2898AD) May 17, 2024PAT CUMMINS IS WINNING THE HEART OF ALL HYDERABAD. ❤️- Cummins playing cricket with school kids. pic.twitter.com/0Io3X8pN2Y— Johns. (@CricCrazyJohns) May 17, 2024

Every India Child Must Read This Book Says Infosys Narayana Murthy
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

"మేఘాలయ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి జామ్‌నగర్" వరకు భారతదేశంలోని ప్రతి పిల్లవాడు చదవాల్సిన పుస్తకాలలో ఒకటి ఉందని ఇన్ఫోసిస్ 'నారాయణమూర్తి' ఇటీవల పేర్కొన్నారు. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రస్తుతం 'కాన్సెప్టువల్ ఫిజిక్స్' చదువుతున్నట్లు పేర్కొన్నారు. పాల్ హెవిట్ అనే హైస్కూల్ టీచర్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.'కాన్సెప్చువల్ ఫిజిక్స్' మొదటిసారిగా 1971లో ప్రచురించారు. ఇందులో క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఆధునిక భౌతికశాస్త్రం వరకు సారూప్యతలు, సూత్రాల చిత్రాలతో వెల్లడించారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తుందని నారాయణ మూర్తి అన్నారు.

Ed Files Chargesheet Against Arvind Kejriwal, Aap In Liquor Policy Case
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) పేరును నిందితుల జాబితాలో చేర్చుతూ ఛార్జ్‌ షీట్‌ను దాఖలు చేసింది. దీంతో దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితులుగా ప్రస్తావించినట్లైంది. మద్యం పాలసీ కేసులో తనను అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది.కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. ఆప్‌పై ఛార్జ్ షీట్‌ నమోదు చేస్తున్నామని, అందులో ఆప్‌ పార్టీని నిందితులుగా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసు 2021- 22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విచారణ జరిపే సమయంలో మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు ఆమ్‌ఆద్మీ పార్టీ అయినప్పుడు.. ఆ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఆ నేపథ్యంలో ఈడీ దీనిపై కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ.100 కోట్ల ముడుపులను ఆప్‌.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. తాజాగా ఆప్‌ను నిందితుల జాబితాలో చేరుస్తూ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 18 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌ చేశాయి. వీరిలో సంజయ్‌ సింగ్‌ బెయిల్‌ మీద బయటకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో మే 10న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Telangana: BRS Hoping Wins 4 Lok sabha Seats Chance To More
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్‌ఎస్‌ ధీమా..

పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏయే అంశాలు ఆ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు? అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారిన తర్వాత బీఆర్ఎస్ బలం పెరిగిందా? మరింత తగ్గిందా? అసలు గులాబీ శ్రేణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం..అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై మాత్రం చాలా ఆశలే పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను లోక్ సభకు చేయకుండా చర్యలు తీసుకుంది. పోటీ చేసే అభ్యర్థులను దాదాపు మెజార్టీ స్థానాల్లో మార్చింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అసలెందుకు ఈ స్థానాల్లో ఆ పార్టీ ఆశలు పెట్టుకుందంటే అందుకు రకరకాల ఈక్వేషన్స్‌ ఉన్నాయంటోంది ఆపార్టీ. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాస్ట్ ఈక్వేషన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ ఎస్ ప్రవీణ్ మాజీ పోలీస్ అధికారి స్థానికంగా బలం ఉంది. అదీకాక నియోజకవర్గంపై పట్టుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గెలిచే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. సికింద్రాబాద్ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు స్థానికంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పద్మారావు గౌడ్. అంతే కాకుండా బీజేపీఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, అభివృద్ది సరిగా చేయలేదన్న విమర్శలు బీఆర్‌ఎస్‌ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలని ఆపార్టీ అంచనా వేస్తోంది.పెద్దపల్లి లో కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గులాబీ పార్టీ అంచనాలు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుండి పోటీ చేసి ఓడిన కొప్పుల ఈశ్వర్ కచ్చితంగా ఇక్కడ గెలుస్తారని భావిస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం పై కొంత జనంలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అందుకే పెద్దపల్లిలో పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకుంది. మెదక్పా‌లో ర్టీ సంస్థాగతంగా బలంగా ఉండటం తో పాటు, ఇక్కడ కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉండటం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట గజ్వేల్ లో భారీగా ఓట్లు పడి మెజారిటీ ఎక్కువ వస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది. గెలవక పోయిన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరిలో రెండో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలపై ఇలానే లెక్కలేసుకున్న బీఆర్‌ ఎస్‌ పార్టీకి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తెలంగాణ ప్రజలు కట్టబెడతారన్నది జూన్ 4న తేలనుంది.

AP Elections: Janasena Fear Of Defeat: Even In Pawan Kalyan Pithapuram
జనసేన డీలా.. పిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....

జనసేన డీలా పడింది... పోలింగ్ తర్వాత సరళి చూసిన నేతలలో నిరుత్సాహం ఆవహించింది. క్రాస్ ఓటింగ్ భయమూ జనసేన నేతలను వెన్నాడుతోంది. సొంత పార్టీ నేతలను నమ్మకపోవడమూ నష్టమే కలిగించిందంటున్నారు. దీనికి తోడు టీడీపీ ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాపు సామాజికవర్గం మినహా మిగిలిన సామాజిక వర్గాల ఓట్లని ఆకర్షించలేకపోయామని భావిస్తున్నారు. గోదావరి జిల్లాలలో ఆశించిన ఫలితాలు కష్టమేనంటున్నారు. ఈ నేపధ్యంలో ఫలితాలపై నేతలు అయోమయంగా ఉన్నారు. పోలింగ్ తర్వాత పవన్ ప్యాకప్ చెప్పేయడమూ జనసేన పరిస్ధితిని తెలియజేస్తోంది.పార్టీ పెట్టి పదేళ్లు అయినా..పోలింగ్ ముగిసిన తర్వాత జనసేన గప్ చుప్ అయింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్యాకప్ చెప్పేయడం పార్టీని డైలమా పడేస్తోంది. పోలింగ్ సరళిపై విశ్లేషణ తర్వాత ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. జనసేన ఏర్పడి దశాబ్ధకాలం దాటుతున్నా ఇప్పటికీ అద్యక్షుడు పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోవడం పెద్ద మైనస్ గానే చెప్పుకోవాలి. ఆది నుంచి పవన్ వ్యవహార శైలే పార్టీని నట్టేట ముంచిందని భావిస్తున్నారు. ఇపుడు కూడా టీడీపీతో జతకట్టడం..పైగా టీడీపీ కోసం దిగజారిపోయి బలమైన సీట్లను సైతం వదులుకోవడం. కేవలం 21 సీట్లకే పరిమితమవడం ఇవన్నీ జనసేన పార్టీని కొంపముంచాయంటున్నారు.ఒక సిద్దాంతం, లక్ష్యం లేకుండాకేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహడ్డిని పదవి నుంచి దింపడానికే తాను కూటమిగా ఏర్పడ్డామని, ఓటు చీలకూడదంటూ పవన్ ప్రతీ సభలోనూ చెప్పిన వ్యాఖ్యలు పూర్తిగా నెగటివ్‌గా మారాయంటున్నారు. పార్టీకి ఒక సిద్దాంతం, లక్ష్యం లేకుండా సీఎం వైఎస్ జగన్‌పై అక్కసుతో కేవలం ఎదుట పార్టీపై బురదజల్లడం ప్రజలలో వ్యతిరేకత పెంచిందంటున్నారు. వాస్తవానికి జనసేన పార్టీ కనీసం 50, 60 సీట్లలో నైనా పోటీ చేయాలని కాపు నేతలు సూచించారు.నేతల మాటలను పెడచెవినట్టి..మాజీ మంత్రి హరిరామజోగయ్య లాంటి నేతలైతే ఏకంగా పలుమార్లు పవన్‌కు లేఖ రాయడమే కాదు స్వయంగా కలిసి కూడా సగం సీట్లలోనైనా పోటీ చేయాలని సూచించారు. అయితే పవన్ ఆ మాటలన్నీ పెడచెవిన పెట్టి కేవలం 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లకే పరిమితమయ్యారు. అందులోనూ కూడా జనసేనని నమ్ముకుని దశాబ్ధకాలంగా పార్టీకోసం కష్టపడుతున్న నేతలకి కాకుండా ఇతర పార్టీ నేతలకి అవకాశం ఇవ్వడం, అలాగే జనసేన పోటీ చేయాల్సిన స్ధానాలని టీడీపీకి వదిలేయడం పార్టీలో చిచ్చురేపింది సీనియర్ నేతలకు తీవ్ర ఆగ్రహంముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలోనూ ఈ వ్యవహారాలే పార్టీని రోడ్డున పడేశాయి. ఇలా మొదట నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని చివరి నిమిషంలో అవనిగడ్డ సీటులో టిడిపి నుంచి మండలి బుద్ద ప్రసాద్ లాంటి నేతలను జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం పార్టీ సీనియర్ నేతలకి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఇక పాలకొండలో సైతం ఇదే విధంగా టీడీపీకిి చెందిన నిమ్మక జయరాజుని జనసేనలో చేర్చుకుని టికెట్‌ ఇవ్వడం వివాదాన్ని రాజేసింది. అలాగే తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకి కూడా చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపై జనసేనలో అలజడి రేపింది.జనసేన బలం ఉన్న సీట్లని టీడీపీకి త్యాగంఅదే విదంగా మచిలీపట్నం ఎంపి సీటుని వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎంపి బాలశౌరికి ఇవ్వడం జనసేన నేతలని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఇక గోదావరి జిల్లాలలో అయితే అక్కడ పార్టీ నియోజకవర్గి ఇన్ చార్జిలకి వెన్నుపోటు పొడుస్తూ జనసేన బలం ఉన్న సీట్లని సైతం టీడీపీకి త్యాగం చేయడం తీవ్ర నిరాశలోకి నెట్టింది. జనసేనకు గుడ్‌బైదీంతో కాకినాడ రూరల్ నుంచి మాజీ మేయర్ సరోజ, అమలాపురం ఇన్ చార్జి శెట్టి బత్తుల రాజాబాబు, రాజోలు ఇన్ చార్జి బొంతు రాజేశ్వరరావు, ముమ్మిడవరం ఇన్ చార్జి పితాని బాలకృష్ణ తదితరులు ఏకంగా జనసేనికు గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే విజయవాడ పశ్చిమ సీటు ఆశించిన పోతిన మహేష్ కి కాకుండా బీజేపీకి వదిలేయడం కూడా పెద్ద వివాదాన్నే సృష్టించింది. పవన్ శైలిపై విమర్శలుచివరి నిమిషం వరకు పోతిన మహేష్ పెద్ద ఎత్తున విజయవాడ పశ్చిమ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమై ఆఖరికి వైఎస్సార్‌సీపీలో చేరిపోయి పవన్ శైలిపై పూర్తి స్ధాయిలో ద్వజమెత్తారు. అడుగడుగునా పవన్‌ను ప్రశ్నిస్తూ ఇరకాటంలో పెట్టారు.ఇక జగ్గంపేటలో అయితే పాఠంశెట్టి సూర్యచంద్ర జనసేనకు షాక్ ఇచ్చి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఇక అనకాపల్లి సీటు విషయంలో కూడా చివరి నిమిషంలో పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృ్ణ కి ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇక కాకినాడ రూరల్‌లో పంతం నానాజీకి టిక్కెట్ ఇవ్వడంతో నిరాశపడిన మాజీ మేయర్ సరోజ తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తుతూ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఒక్క మహిళకి కూడా టికెట్ ఇవ్వకపోవడం తీవ్ర నిరాశఇక రాజమండ్రి రూరల్ ఆశించి జనసేనకి పనిచేసిన కందుల దుర్గేష్‌ను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోసం బుజ్జగించి చివరికి ఆయనను ఏమాత్రం అవగాహనలేని నిడదవోలు నియోజకవర్గానికి చివరి నిమిషంలో పంపడం అక్కరకు రాకుండా పోయిందంటున్నారు. ఇక గత ఎన్నికల సమయంలో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ స్ధానాన్ని టీడీపీ ఇన్ చార్జి రామాంజనేయులుకి జనసేన కండువా కప్పి ఇవ్వడంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఒక్క మహిళకి కూడా టికెట్ ఇవ్వకపోవడంపైనా మహిళా నేతలలో తీవ్ర నిరాశని మిగిల్చింది..ఇలా సీట్ల పంపకాలలోనే సొంత పార్టీలోనే పవన్ తన తీరుతో నిప్పు రాజేసుకున్నారు.ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టికెట్‌జనసేన పోటీ చేసిన నాలుగైదు స్ధానాలు మినహా మిగిలిన స్ధానాలను ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం వల్ల జనసేన బలం ఎన్నికల ముందే తేలిపోయిందని చెబుతున్నారు. ప్రజల్లోకి ఈ సంకేతాలు బలంగా వెళ్లడంతో ఎదురుగాలి వీచిందంటున్నారు. గత ఎన్నికల సమయంలో పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాలలో పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు .ఆ తర్వాత ఆ రెండు నియోజకవర్గాలను పవన్ పట్టించుకోలేదు. ఎన్నికలు ముగియగానే పవన్ రెండు నియోజకవర్గాలలో ఇళ్లతో పాటు పార్టీ కార్యాలయాలను ఖాళీ చేశారు. ఆ తర్వాత తనకి ఓటు వేసిన ఆ రెండు నియోజకవర్గాల ప్రజలను పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల తర్వాత పవన్ తమకు అందుబాటులో ఉండరనే భావన ప్రజలలో పెరిగిపోయింది. ఈ ఎన్నికలలో పవన్ ఆ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగకుండా పిఠాపురం ఎంచుకోవడం వెనుక కారణం ఇదే అంటున్నారు. అలాగే తన గెలుపుకోసం పవన్ వారంలో మూడు రోజుల పాటు పిఠాపురంలోనే ప్రచారం చేసినా ఫలితం తమకు అనుకూలంగా ఉంటందని నేతలు ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. ఇక పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే టీడీపీ ఇంచార్జి చార్జి వర్మ నుంచి వచ్చిన వ్యతిరేకత తీవ్ర ఇరకాటంలో పడేసింది. ఆ తర్వాత పవన్ చంద్రబాబుతో చెప్పించుకుని స్వయంగా వర్మ ఇంటికి వెళ్లి షో చేసినా అది పనిచేయలేదంటున్నారు.వంగా గీత పోటీ పవన్‌కు మైనస్ పిఠాపురం నుంచి ఒకసారి పవన్ కళ్యాణ్ నెగ్గితే శాశ్వతంగా తన సీటుకి ఎసరే అన్న ఉద్దేశంతో వర్మ పవన్ గెలుపుకోసం పూర్తి స్ధాయిలో పనిచేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీ వంగా గీత పోటీ చేయడం పవన్‌కు మైనస్ అయిందంటున్నారు. నాలుగు దశబ్ధాలగా రాజకీయాల్లో ఉన్న వంగా గీతకి కాకినాడ జిల్లాలో మంచి పేరుంది. వంగా గీత జెడ్పీ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజలలో కలిసిపోయినవైనం వంగా గీతకి పాజిటివ్ అయిందంటున్నారు.దీనికి తోడు వంగాగీతపై పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రజలలో ఆమెపై సానుభూతి పెంచేలా చేశాయంటున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు వంగా గీత చేసిన ప్రసంగం. అదే సమయంలో గీతమ్మని గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఇవన్నీ ఓటర్లని ఆలోచింపచేశాయంటున్నారు.పవన్‌ గెలిచినా ఎలాగూ సీఎం కాలేరుపవన్ గెలిచినా కూడా 21 సీట్లతో ఎలాగూ సీఎం కాలేరని... కనీసం మంత్రిగా కూడా అవకాశం ఇస్తారో లేదో తెలియదని భావించిన ఓటర్లు వంగా గీతని గెలిపిస్తే తమ నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సిఎం అవుతుందన్న ఉద్దేశంతోనే మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలు కట్టారంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ గెలుపుపై పోలింగ్ ముందు వరకు భారీ బెట్టింగ్‌లకు దిగిన జనసేన నేతలు ఇపుడు మాత్రం ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారట.జనసేన పార్టీ గోదావరి జిల్లాలనే నమ్ముకుని బరిలోకి దిగింది. మొదట నుంచి తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలపైనే పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు.ఈ రెండు జిల్లాలలో కాపు సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండటంతో పవన్ తనకి ఈ రెండు జిల్లాలలో ఎదురు ఉండదనుకున్నారు. జనసేన మొత్తంగా 21 అసెంబ్లీ స్ధానాలలో పోటీ చేస్తే ఇందులో ఈ రెండు జిల్లాల నుంచి 11 స్ధానాలు ఉన్నాయి. అయితే గోదావరి జిల్లాలలో కాపు ఓటర్లను తప్పితే మిగిలిన సామాజికవర్గాలని పట్టించుకోకపోవడం. అందరి నాయకుడిగా ఉండాల్సిన పవన్ కాపు చట్రంలోనే ఉండిపోవడం పార్టీకి చేటు తెచ్చాయంటున్నారు.ఈ నేపథ్యంలో కాపు ఓట్లలో కూడా పూర్తిగా తమకు పడలేదని నేతలు చెబుతున్నారు. ఇక టీడీపీ కోసం పవన్ ఎన్ని త్యాగాలు చేసినా టిడిపి నుంచి మాత్రం పూర్తి స్ధాయిలో ఓట్ల బదిలీ జరగలేదని జనసేన నేతలు భావిస్తున్నారు. టీడీపీకి ఎంతలా సహకరించినప్పటికీ కూడా తమకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ స్ధాయిలో సహకారం అందలేదని, చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ కూడా కొంప ముంచిందంటున్నారు. ఇలా పోటీ చేసిన 21 స్ధానాలలో కనీసం రెండు,మూడు స్ధానాలలో కూడా గెలుపు కష్టమేనని, వైఎస్ జగన్ గాలి వీస్తే ఆ సీట్లు కూడా రావడం కష్టమేనంటున్నారు.ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో పవన్ విఫలంఈసారైనా తమ అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెడతారని ఆశించామని, కానీ చేతులారా పవన్ ఆ అవకాశాలను సైతం జారవిడుచుకున్నారని, ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో పవన్ విఫలమయ్యారని, కానీ చంద్రబాబు నమ్మకాన్ని సంపాదించుకున్నారని సొంతపార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఇక ఎన్నికల ముగిసిన తర్వాత పోలింగ్ సరళి చూసుకున్న జనసేన నేతలు మీడియాకు పూర్తిగా ముఖం చాటేశారు. నేతలెవరూ మీడియా ముందుకురాలేదు.ఇక పవన్ అయితే తన ఓటు కూడా తనకి వేసుకోలేకపోయారు.. మంగళగిరిలో ఓటు వేసిన తర్వాత అదే రోజు సాయంత్రం పవన్ వారణాసి వెళ్లి ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత నేరుగా వారణాసి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎన్నికల ముగియడంతో ఆంద్రా నుంచి ప్యాకప్ చెప్పారని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా అటు పవన్ తీరుతో జనసేన పార్టీ పూర్తిగా డీలా పడింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement