
యూపీలో భర్త హడల్.. కలెక్టర్‌కు ఫిర్యాదు!
సీతాపూర్ (యూపీ): అక్టోబర్ 4వ తేదీ.. అది జిల్లా కలెక్టర్ కార్యాలయం. ‘ప్రజా సమస్యల పరిష్కార దినం’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అభి షేక్ ఆనంద్ కక్షిదారుల నుంచి వినతు లు స్వీకరిస్తున్నారు. అప్పుడే ఓ తమా షా జరిగింది.. మహమూదాబాద్ తహ సీల్‌లోని లోధాసా గ్రామానికి చెందిన మీరాజ్ కూడా కలెక్టర్‌ను కలిశాడు. ఆ యన చెప్పింది విన్న కలెక్టర్ తేరుకోవ డానికి చాలా సమయం పట్టింది.
‘రాత్రయితే చాలు.. నా భార్య ’నాగిని’లా మారిపోతోంది. స్.. స్. అంటూ బుసలు కొడుతోంది.. నాట్యం చేస్తోంది.. భయపెడుతోంది.. నాకు నిద్ర కరువయ్యింది.. ఆమెతో కలిసి పడుకోలేక పోతున్నా!’.. ఇదీ మీరాజ్ చెప్పిన సారాంశం. అది విని.. కలెక్టర్ సహా అక్కడున్న అధికారులందరికీ నోట మాట రాలేదు. ‘మా ఆవిడ నసీమున్కికి మతిస్థిమితం లేదు. రాత్రి కాగానే ఆవిడ నాగినిలా మారిపోతోంది. ఆవిడ నాట్యం, బుసలు, స్... స్... అంటూ చేసే అల్లరితో నా గుండె జారిపోతోంది!’.. అని మీరాజ్ బావురు మన్నాడు.
పోలీసుల దగ్గరకు వెళ్తే ‘ఇది మీ భార్యాభర్తల వ్యవహారం.. మీరే తేల్చుకోండి’.. అనడంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చానని వాపోయాడు.అతను చెప్పింది విన్న కలెక్టర్ మొదట అవాక్కయినా.. తర్వాత తేరుకుని.. ‘ఏం జరిగిందో విచారణ జరపండి.. తగిన చర్య తీసుకోండి’.. అని పోలీసులకు ఆదేశాలిచ్చారట. ‘ఫిర్యాదు అందింది, దర్యాప్తు జరుగుతోంది’.. అని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆ ’నాగిని’ని పట్టుకోవాలా?, లేక ఆమెకి కౌన్సెలింగ్ ఇవ్వాలా? అని పోలీసులు తల బాదుకుంటున్నారు.