టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు! | Complaint On Tollywood Choreographer Johnny Master Goes Viral | Sakshi
Sakshi News home page

Johnny Master: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు!

Published Fri, Jun 21 2024 4:30 PM | Last Updated on Fri, Jun 21 2024 4:45 PM

Complaint On Tollywood Choreographer Johny master Goes Viral

ప్రముఖ  టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు నమోదైంది. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఆయనపై కంప్లెంట్‌ చేశారు.  జానీ మాస్టర్‌పై డ్యాన్సర్ సతీశ్‌ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.   ఆయన చేసిన అరాచకాలపై ఏపి  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొరియర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

అసలేం జరిగిందంటే..

ఈ నెల 5న కూడా తనను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో డ్యాన్సర్ సతీష్ ఫిర్యాదు చేశారు. తనని షూటింగ్‌లకు పిలవకుండా వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  షూటింగ్స్‌కు సతీష్‌ను పిలవ‌వద్దని జానీ మాస్టర్ యూనియన్ సభ్యులతో ఫోన్లు చేయిస్తున్నాడని ఫిర్యాదులో ప్రస్తావించారు.  

దీంతో గత నాలుగు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నానని వెల్లడించారు. జనరల్ బాడీ మీటింగ్‌లోనూ సమస్యల‌పై మాట్లాడినందుకే జానీ మాస్టర్ తనపై పగ పెంచుకున్నాడని కంప్లైంట్‌లో సతీశ్‌ వివరించారు. కాగా.. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రస్తుతం జానీ మాస్టర్ బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement