వికీపీడియాకు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే! | Government raps Wikipedia overBias says small group controls edits: | Sakshi
Sakshi News home page

వికీపీడియాకు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే!

Nov 5 2024 1:16 PM | Updated on Nov 5 2024 3:06 PM

Government raps Wikipedia overBias says small group controls edits:

న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెబ్‌సైట్‌లో  కచ్చితత్వం లేని కూడిన సమాచారం ఉందన్న  ఫిర్యాదుల మేరకు  కేంద్రం నోటీసులు ఇచ్చింది. 

వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా  ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్‌ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. 

కాగా ఇటీవలే వికీపీడియాపై న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ సంస్థ పరువుకు భంగం కలిగించే విధంగా వికీపీడియా వ్యవహరించిందంటూ ఢిల్లీ హైకోర్టులో రూ. 2 కోట్ల పరువునష్టం దావా వేసింది. దీనిపై కోర్టు కూడా వికీపీడియాకి చీవాట్లు పెట్టింది.  ‘కోర్టు ధిక్కార నోటీసులు’ కూడా జారీ చేసింది.

 భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారత్‌ తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని తెలిపింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్‌సైట్ యునైటెడ్ స్టేట్స్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement