
ప్రముఖ బిగ్బాస్ కంటెస్టెంట్ కశిష్ కపూర్ (24) పోలీసులను ఆశ్రయించింది. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పీఎస్లో ఫిర్యాదు చేసింది. తన ఇంటి పనిమనిషి సచిన్ కుమార్ చౌదరి ఈ చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబయిలోని అంబోలి స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తన బీరువాలోని రూ.4 లక్షల నగదు చోరీ చేశాడని జూలై 9న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా.. సచిన్ కుమార్ మార్ చౌదరి గత ఐదు నెలలుగా ఆమె ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్నారని పోలీసులకు తెలిపింది. కాగా.. బిగ్బాస్ బ్యూటీ కశిశ్ కపూర్ బీహార్ స్వస్థలం కాగా.. ప్రస్తుతం ముంబయి అంధేరి వెస్ట్‌లోని ఆజాద్‌నగర్ వీర దేశాయ్ రోడ్‌లోని సొసైటీలో నివసిస్తోంది. ఆమె సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్లో నటించింది. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్గా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది.