పోచారం, సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు.. స్పీకర్‌కు మెయిల్‌ | Brs Complaint On Mlas Defection To Speaker Through Mail | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలు పోచారం, సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు.. స్పీకర్‌కు మెయిల్‌

Jun 26 2024 2:09 PM | Updated on Jun 26 2024 3:05 PM

Brs Complaint On Mlas Defection To Speaker Through Mail

సాక్షి,హైదరాబాద్‌: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్‌లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్‌ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది.

గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్‌ఎస్‌ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement