పక్కా కుట్రతోనే టీడీపీ నేతల దాడులు.. డీజీపీకి సాక్షి ఫిర్యాదు | Sakshi Complaint AP DGP On TDP Leaders Atrocities | Sakshi
Sakshi News home page

పక్కా కుట్రతోనే టీడీపీ నేతల దాడులు.. డీజీపీకి సాక్షి ఫిర్యాదు

Jun 11 2025 1:49 PM | Updated on Jun 11 2025 3:03 PM

Sakshi Complaint AP DGP On TDP Leaders Atrocities

సాక్షి, విజయవాడ: ఏపీవ్యాప్తంగా తమ కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులకు తెగపడుతుండడంపై సాక్షి మీడియా సంస్థ పోలీసులను ఆశ్రయించింది. బుధవారం ఉదయం సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాను కలిసి ఫిర్యాదు అందజేసింది. ఏపీలో సాక్షి యూనిట్‌తోపాటు ప్రాంతీయ కార్యాలయాలపై టీడీపీ  నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు జరిపిన దాడులు.. ఆస్తులు విధ్వంసం తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొంది. 

ఈ సందర్భంగా దాడులకు పాల్పడిన  వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సాక్షి ప్రతినిధుల బృందం కోరింది. తద్వారా రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలని తెలిపింది. మహిళలు, బాలికలతో పాటు అన్ని వర్గాల పట్ల సాక్షి మీడియా పూర్తి  గౌరవంతో వ్యవహరిస్తోందని, ఎటువంటి అనుచిత వ్యాఖ్యలను సాక్షి మీడియా సమర్థించదని, పక్కా కుట్రతోనే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీకి స్పష్టం చేసింది. కార్యాలయాలపై దాడికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లను ఆదేశించాలని ఆయన్ని సాక్షి బృందం కోరింది.

ఏపీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స వద్ద సాక్షి ప్రతినిధుల బృందం

Advertisement
 
Advertisement
Advertisement