అనుమానంతో ఘాతుకం
ఆత్మకూరు: భార్యపై అనుమానం పెంచుకు న్న ఓ భర్త ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హనుమ కొండ జిల్లా ఆత్మకూ రు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రా నికి చెందిన అనూష, మంద రవి 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమా ర్తెలు. పెళ్లైన నాలుగేళ్లనుంచి రవి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అనూష ఓ గురుకుల పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుండగా రవి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనపై శారీరక, మానసిక వేధింపులు ఎక్కువ కావడంతో రెండు నెలల క్రితం అనూ ష మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ చేసి పంపించారు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాలే దు. గురువారం రాత్రి రవి భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను పిడిగుద్దులు గుద్దుతూ ఇంట్లోని కత్తి తీసుకుని గొంతు, మెడ, పొట్ట, కుడిచేతిపై ఇష్టానుసారంగా పొడిచాడు. అనూష కేకలు వేయడంతో పక్కగదిలో ఉన్న అత్త, కూతుళ్లు వచ్చి అడ్డుకున్నారు. చుట్టుపక్కలవారి సమాచారంతో 108 సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సీఐ సంతోష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.


