భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్య
మైసూరు: భార్య వేధింపులతో జీవితం మీద విరక్తి చెందిన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మైసూరు ఆలనహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. జిల్లా టి. నరసిపుర తాలూకా నివాసి, ప్రైవేటు కంపెనీ ఇంజనీర్ ఉమేష్ (34), మైసూరులోని సిద్ధార్థ బరంగే నివాసి చన్నబసవేగౌడ కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. ప్రారంభంలో బాగానే ఉన్న భార్యాభర్తలు తరువాత తరచుగా గొడవ పడుతుండేవారని ఉమేష్ తండ్రి గురుమల్లెగౌడ తన ఫిర్యాదులో తెలిపాడు.
గత 2 సంవత్సరాలుగా, ఉమేష్ తన చిన్నారి కూతురిని చూడలేక పోయాడు. భార్య బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. బిడ్డను చూడాలనుకుంటే డబ్బులు ఇవ్వాలని ఆమె వేధించేది. ఇది తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేవాడు. డిసెంబర్ 19న, భార్యకు వీడియో కాల్ చేసి, తన కూతురిని చూపించమని అడిగాడు. అయితే, రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌చేసింది. దీంతో ఆవేదన చెందిన ఉమేష్ తన బాడుగ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. భార్య రమ్య, అతని తల్లిదండ్రులపై చన్నబసవేగౌడపై అలనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


