నీతో కలిసి జీవించలేను విడాకులు ఇవ్వమని నోటీసులిచ్చిన భార్యను అత్యంత దారుణంగా కాల్చి చంపాడో భర్త. వైవాహిక విభేదాలతో ఆమె భర్తను విడాకులు అడిగింది. అదే ఆమె చేసిన నేరం. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
బాధితురాలిని భువనేశ్వరి (39)గా గుర్తించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బసవేశ్వర నగర్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈమె భర్త, నిందితుడు బాలమురుగన్ (40) ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఒక పనిచేసేవాడు. వీళ్లిద్దరూ తమిళనాడులోని సేలం జిల్లాకు చెందినవారు. వీరికి 2011లో వివాహమైంది. 2018లో బెంగళూరుకు మకాం మార్చారు. వీరికిద్దరు సంతానం. అయితే గత నాలుగేళ్లుగా బాలమురుగన్‌కు ఉద్యోగం లేదు. నెమ్మదిగా తగాదాలు మొదలయ్యాయి. దీంతో భార్యపై అనుమానం మొదలైంది. భువనేశ్వరి చట్టబద్ధంగా విడిపోవాలని కోరింది, దానిని బాల మురుగన్ వ్యతిరేకించాడు దీంతో వేరే బ్రాంచ్‌కు ఉద్యోగాన్ని బదిలీ చేయించుకున్న భువనేశ్వరి గత ఏడాదికాలంగా 12 ఏళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురితో కలిసి రాజాజీ నగర్‌లో వేరుగా నివాసముంటోంది. బాలమురుగన్ కేపీ అగ్రహారలో ఒంటరిగా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం భువనేశ్వరి బాలమురుగన్‌కు విడాకుల నోటీసు పంపింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్
అటు ఉద్యోగం లేదు, ఇటు భార్యతో గొడవలు, అనుమానం, విడాకుల నోటీసులు దీంతో భార్యపై ఆగ్రహం పెంచుకున్న బాలమురుగన్ ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నారు. భార్య కదలికలను పసిగట్టి, సరిగ్గా ఆమె ఆఫీసునుంచి ఇంటికి వచ్చే సమయంలో కాపుగాసి ఆమెను అడ్డుకున్నాడు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో, రాజాజీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని 1వ ప్రధాన రోడ్డులో చాలా సమీపంనుంచి ఆమెపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పిస్టల్‌తో సహా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
హొయసల పెట్రోల్ సిబ్బంది గాయపడిన భువనేశ్వరిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అప్పటికేఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా వినిపించిన కాల్పులను భయాందోళనలు రేకెత్తించాయి. జనం పరుగులు తీశారు. రెండు బుల్లెట్లు భువనేశ్వరి తలపై దూసుకుపోగా, మిగిలిన రెండు బుల్లెట్లు ఆమె చేతికి తగిలాయి.
నిందితుడు తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడని, ఇదే గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, అతనికి ఆయుధం ఎలా వచ్చింది, దానికి లైసెన్స్ ఉందా? తదితర వివరాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.


