
న్యూఢిల్లీ: తన సోదరి నిక్కీ భాటి దారుణ హత్యకు గురి కావడంపై సోదరుడు రోహిత్ గుర్జార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరి నిక్కీ భాటిని శాశ్వతంగా తిరిగి పుట్టింటికి తీసుకొచ్చినట్లైతే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నాడు. తన సోదరి నిక్కీ భాటి విషయంలో తాము రాజీ పడే బ్రతికామని, అందుకు ఇంతటి దారుణం జరిగిపోయిందన్నాడు.
సమాజానికి జడిసి తన సోదరిని పుట్టింటికి తీసుకురావడంలో వెనుకడుగు వేశామన్నాడు. సమాజంలో తమ పరువు పోతుందనే ఆలోచించాం కానీ సోదరీ పడే బాధను పూర్తిగా అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నాడు.
‘మేము మా సోదరీమణులు నిక్కీ, కాంచనాల కోసం రూ. 8 లక్షల ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టించాం. ఆ పార్లర్‌లు పెట్టించి సుమారు ఏడాదిన్నర అవుతుంది. బావలు విపిన్, రోహిత్ భాటిలకు ఎటువంటి ఉద్యోగాలు లేవు. వారి కుటుంబానికి చిన్న కిరాణా దుకాణం మాత్రమే ఉంది. కానీ మా చెల్లెళ్లు వారి స్వయం శక్తితో పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. భర్తల నుంచి ఎటువంటి నగదు అడగకుండానే కుటుంబాన్ని లాక్కొస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మా చెల్లెళ్ల పార్లర్లను అత్త మామలు ధ్వంసం చేశారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు సోదరుడు గుర్జార్.
భర్త విపిన్ భాటి బాధలు భరించలేక చాలాసార్లు తిరిగి పుట్టింటికి వచ్చేదని, కానీ వారు మళ్లీ బుజ్జగింపు మాటలు చెప్పి తిరిగి తీసుకెళ్లిపోయేవారని నిక్కీ భాటి కుటుంబం తెలిపింది.
అతి దారుణంగా హత్య..
యూపీ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో పరిధిలో సిర్సా గ్రామంలో విపిన్ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విపిన్ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు. అయితే డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పుల బారిన పడ్డాడు.
మరో రూ. 35 లక్షలు కావాలని వేధింపులు
మరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త, అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.
ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేసి చివరికి అతి దారుణంగా ఒంటికి నిప్పంటించి హత్య చేశారు.
యాసిడ్ పోసి లైటర్‌తో అంటించి కన్నకొడుకు కళ్లముందే భార్యను తగలబెట్టాడు