
న్యూఢిల్లీ: వరకట్న వేధింపులతో భార్యను హత్య చేసిన ఓ భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోబోయి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య నిక్కీ భాటిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న భర్త విపిన్ భాటి పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. భార్యను చంపినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేని అతను తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు. దాంతో అతని కాళ్లపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయాలపాలయ్యాడు. అతన్ని సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పరిధిలో గ్రేటర్ నోయిడాలోవిపిన్ భాటి అనే 28 ఏళ్ల వ్యక్తి.. భార్య నిక్కీ భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు. విపిన్ భాటి అతని తల్లి దండ్రులతో కలిసి భార్య నిక్కీ భాటిని హత్య చేశాడు. ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటన గురువారం( ఆగస్టు 21వ తేదీన) జరగ్గా ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు. అయితే డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పుల బారిన పడ్డాడు.
కాగా, మరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, భర్త, అత్తమామలు కలసి 28 ఏళ్ల నిక్కీ అనే మహిళ ఒంటికి నిప్పంటించి, ఆమె ప్రాణాలను బలిగొన్నారని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోటీసులు మృతురాలు నిక్కి భర్త భర్త విపిన్ భాటీ (28)ని అరెస్టు చేయగా, అతని తండ్రి సత్యవీర్ భాటి, సోదరుడు రోహిత్ భాటి పరారీలో ఉన్నారు. తన సోదరి నిక్కీని అత్తామామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది.
ఈ దారుణం ఆగస్టు 21న కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటుచేసుకుంది. నిక్కీని కట్నంగా రూ.35 లక్షలు తీసుకురావాలంటూ వేధిస్తున్నారేది ప్రధాన ఆరోపణ.