గుజరాత్‌లో ఓ ప్రబుద్ధుని నిర్వాకం
సూరత్: వారిద్దరూ భార్యాభర్తలు. కొన్నాళ్లుగా తరచూ కీచులాడుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో ఒక రోజు వారి నడుమ మాటామాటా పెరిగింది. ఆవేశంలో భార్య ఒంటిపై డీజిల్ గుమ్మరించుకుని నిప్పంటించుకుంది. మంటల్లో చిక్కి హాహాకారాలు చేస్తుంటే కాపాడాల్సింది పోయి, ఆ ప్రబుద్ధుడు ఆమె మరణయాతనను తీరిగ్గా వీడియో తీస్తూ కూచున్నాడు! అంతేగాక, డీజిల్ పోసుకునేలా ఆమెను కావాలనే రెచ్చగొట్టినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది!!
జనవరి 4న గుజరాత్‌లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బిహార్‌కు చెందిన రంజిత్ సాహా (33), ప్రతిమాదేవి (31) 2013లో ఇంటినుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుదెరువు కోసం మూడేళ్ల క్రితం సూరత్‌లోని ఇచ్ఛాపూర్‌లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పిల్లలు, వారి చదువులు తదితరాల విషయమై కొంతకాలంగా దంపతులు తరచూ ఘర్షణ పడుతూ వస్తున్నారు.
జనవరి 4న వారి మధ్య గొడవ పెద్దదైంది. ఆ క్రమంలో, చేతనైతే ఒంటిపై ఏమన్నా పోసుకుని అంటించుకోవాల్సిందిగా రంజిత్ రెచ్చగొట్టాడు. దాంతో ఆవేశానికి లోనైన ప్రతిమ, అతను అప్పటికే గ్యారేజీ నుంచి తెచ్చి ఉంచిన డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను వారించేందుకు గానీ, నిప్పింటించుకున్నాక కాపాడేందుకు గానీ రంజిత్ ఏమాత్రమూ ప్రయతి్నంచలేదు. పైగా, ఈ ఘటనలో తన ప్రమేయం లేదని నిరూపించుకునేందుకు ఆమె డీజిల్ పోసుకోవడం మొదలుకుని నిప్పంటించుకుని హాహాకారాలు చేయడం దాకా మొత్తం ఘటనను తన మొబైల్లో వీడియో తీస్తూ కూచుకున్నాడు!
కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రతిమ వారం తర్వాత స్పృహలోకి వచి్చంది. తానే డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నానంటూ వాంగ్మూలమిచ్చి మరణించింది. కానీ ఆమె సోదరుడు మాత్రం రంజిత్ తీరుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంజిత్‌ను అదుపులోకి తీసుకుని అతని మొబైల్‌ను పరిశీలించగా ఈ వీడియో నిర్వాకం వెలుగులోకి వచి్చంది. ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఫినాయిల్‌లో కలిపేందుకంటూ రంజిత్ గ్యారేజీ నుంచి డీజిల్ తెచ్చి ఇంట్లో పెట్టినట్టు విచారణలో తేలింది. బహుశా పక్కా ప్లాన్ ప్రకారమే అతను ఇదంతా చేసినట్టు వారు అనుమానిస్తున్నారు. అతనిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


