
బిజినెస్ టు బిజినెస్ గెలుపు పాఠం
కొన్ని దశాబ్దాల క్రితం మారుతి వినాయక్ గోకర్ణ అనే యువ ఇంజినీర్ ఎన్నో కలలతో చిన్న కంపెనీ ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత వినాయక్ చనిపోవడంతో కంపెనీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వినాయక్ భార్య అనురాధ (Anuradha M Gokarn) కు వ్యాపార వ్యవహారాల గురించి ఏమీ తెలియదు. అప్పటికి ఆమె వయసు 44 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు.
‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన అనురాధ కంపెనీ నిర్వహణ బాధ్యతను భుజాన వేసుకుంది. పాఠాలు చెప్పినంత తేలిక కాదు’ అన్నారు విమర్శకులు. అయితే కంపెనీ బాధ్యతలు తీసుకున్న తరువాత తానే ఒక గెలుపు పాఠం అయింది. అప్పుల బారిన పడిన కంపెనీని ఆరు సంవత్సరాల వ్యవధిలో లాభాల బాట పట్టించింది.
కట్ చేస్తే...
ఆ కంపెనీ పేరు... ట్రిటాన్ వాల్వ్(Triton Valves Ltd) మన దేశంలో ఆటోమోటివ్ టైర్ వాల్వ్‌లు, ఉపకరణాల తయారీలో అతి పెద్ద సంస్థ. వాహన పరిశ్రమకు అవసరమైన అత్యున్నతమైన టైర్ వాల్వ్‌లను అందించే ప్రపంచస్థాయి సంస్థగా ఎదిగింది.
‘నిన్న చేసిన పొరపాటు నేడు పాఠం అవుతుంది. నా వ్యాపార ప్రస్థానంలో అలాంటి పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను’ అని తన సక్సెస్‌మంత్రా గురించి చెప్పింది అనురాధ గోకర్ణ.
చదవండి: నో టికెట్.. నో మనీ : విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘన్ బాలుడు