హర్దోయి: భార్య ప్రియుడితో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి..పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఆమెను తుపాకీ కాల్చి చంపాడు. ఈ ఘటన యూపీలోని హర్దోయిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌పూర్ అతారియా వాసి అనూప్. ఇతడి భార్య సోనీ(35) వారం క్రితం ప్రియుడితో వెళ్లిపోయింది. నగలతోపాటు రూ.35 వేల నగదును ఆమె పట్టుకెళ్లిందంటూ అనూప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో, పోలీసులు సోనీని ఆదివారం పట్టుకొచ్చి, స్టేషన్‌లో ఉంచారు. సోమవారం అనూప్‌ను పిలిపించారు. సోనీని కోర్టులో హాజరు పర్చే రాత పనులు జరుగుతున్నాయి. పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఉన్న క్యాంటిన్‌లోకి సోనీని ఓ మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్తుండగా, అనూప్ అడ్డుకున్నాడు. వెంటతెచ్చుకున్న తుపాకీతో సోనీపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సోనీ అక్కడికక్కడే చనిపోయింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన అనూప్‌ను పోలీసులు పట్టుకుని, తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు.


