కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య | Married woman ends life in hyderabad | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

Feb 28 2026 8:12 AM | Updated on Feb 28 2026 8:12 AM

Married woman ends life in hyderabad

హైదరాబాద్‌: జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ఫరిధిలో కుటుంబకలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. షిరిడి హిల్స్‌లో ఉండే  దివ్యా రెడ్డి (33) కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. కాగా అదేప్రాంతానికి చెందిన నర్సింహా అనేవ్యక్తి  గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను  గుడిలో పెళ్లి చేసుకున్నాడు.

 అయితే ఇటీవలే వీరి మధ్య గొడవలు సాగుతున్నాయి. శుక్రవారం కూడా  గొడవ ఎక్కువ అవ్వడంతో దివ్యా రెడ్డి ఇంట్లోనే నిద్రమాత్రలు మింగి ఆపస్మారక స్థితికి చేరుకుంది.. గమనించిన స్థానికులు ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించగా  వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement