మీరట్: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి గుట్టుగా నడుపుతున్న ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలిసింది. దీనిని గ్రహించిన ఆమె భర్త ఎక్కడ రచ్చ చేస్తాడోనని భయపడి, అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం తీసుకుంది. ఒక ప్లాన్ ప్రకారం భర్త అడ్డు తొలగించుకుంది. అయితే ఆ తర్వాత చట్టం ఏం చేసింది?
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఒక యువకుని మృతదేహం అతను ఉంటున్న గ్రామం వెలుపలి పొలంలో పోలీసులకు కనిపించింది. మృతదేహంపై మూడు బుల్లెట్ల గుర్తులు కనిపించాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొలుత దీనిని దోపిడీ కోసం చేసిన హత్యగా భావించారు. అయితే తదుపరి దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పోలీసులు అగ్వాన్‌పూర్ గ్రామంలో ఉంటున్న మృతుడి భార్య అంజలి విచారించేందుకు ఉపక్రమించగా, ఆమె ఇంటి నుంచి పరారైనట్లు తేలింది. అయితే అంజలికి అదే గ్రామానికి చెందిన అజయ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు కనుగొన్నారు.
దీంతో పోలీసులు అజయ్‌ను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే అతను కూడా ఇంట్లో లేడని తెలిసింది. ఈ జంట అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తరువాత పోలీసులు వారికోసం వెదుకులాట సాగించి, ఎట్టకేలకు అదుపులోనికి తీసుకున్నారు. విచారణ సమయంలో అజయ్ నిజం వెల్లడించాడు. అంజలి భర్త రాహుల్ తమ సంబంధం గురించి తెలుసుకున్నాడని, దీంతో అంజలి కలత చెందిందని, తరువాత ఆమె భర్తను చంపేందుకు ఒక ప్లాన్ చేసిందని అతను చెప్పాడు. ఈ నేపధ్యంలోనే అజయ్ స్వయంగా రాహుల్‌ను పొలాల దగ్గర కలుసుకుందామని చెప్పాడు. అతను రాగానే అతనిపై రాహుల్ మూడుసార్లు తుపాకీ కాల్పులు జరిపాడని దర్యాప్తులో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ట్రంప్‌కు ‘శాంతి బహుమతి’?.. డిసెంబర్ ఐదున ప్రదానం


