Bihar Election: ఎన్నికల బరిలో ప్రముఖ గాయకుని భార్య? | Bhojpuri Singer-Actor Khesari Lal Yadav Plans To Have His Wife Contest In Bihar Elections | Sakshi
Sakshi News home page

Bihar Election: ఎన్నికల బరిలో ప్రముఖ గాయకుని భార్య?

Oct 15 2025 3:18 PM | Updated on Oct 15 2025 3:48 PM

Bhojpuri Star Khesari Lal Yadav Wants Wife to Contest Bihar Polls

పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ నేతలతో పాటు పలువురు గాయనీగాయకులు, నటులు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా భోజ్‌పురి గాయకుడు, నటుడు ఖేసరి లాల్ యాదవ్  ఈ ఎన్నికల్లో తన పాత్రపై ఏమిటనేది వెల్లడించారు. తాను ఆర్జేడీ తరపున ప్రచారం చేయనున్నానని, తన భార్యను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నానని తెలిపారు.
 

భోజ్‌పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్  మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తన భార్య చేత పోటీ చేయించాలని అనుకుంటున్నానని, ఇందుకోసం ఆమెను ఒప్పించేందుకు ‍ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఒకవేళ ఆమె ఇందుకు అంగీకరిస్తే, తమ నామినేషన్ దాఖలు చేస్తామని, లేనిపక్షంలో తాను  ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. ఇటు తేజస్వి యాదవ్, అటు అఖిలేష్ యాదవ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పోటీ చేసే విషయంలో రెండు పార్టీల నుండి తనపై ఒత్తిడి  ఉన్నదని ఖేసరి లాల్ యాదవ్ పేర్కొన్నారు. తన భార్య అంగీకరిస్తే, ఆమె చేత ఖచ్చితంగా పోటీ చేయిస్తానని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement