
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం జరిగింది. భర్త తన భార్య గొంతును కోసిన ఘటన నాగోల్‌లో చోటు చేసుకుంది. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.
గత యాడాది క్రితమే మహాలక్ష్మి(20)కి వేణుగోపాల్‌తో వివాహమైంది. అదనపు కట్నం తేవాలంటూ పెళ్ళైన నెల నుండే భార్యపై భర్త పలుమార్లు దాడి చేశాడు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా భర్త తీర మారలేదు. వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
