
సాక్షి, హైదరాబాద్: సరూర్‌నగర్‌లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భార్య.. భర్తను హతమార్చింది. కోదండరాంనగర్ రోడ్డు నెం.7లో ఈ ఘటన జరిగింది. మృతుడు జెల్లెల శేఖర్ (40)గా పోలీసులు గుర్తించారు. భార్య చిట్టి(33)ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. శేఖర్ మృతదేహం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
భర్తను చంపిన తర్వాత నిద్రలోనే చనిపోయాడంటూ 100 నంబర్‌కు భార్య డయల్ చేయగా.. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. మృతుడి భార్యను పోలీసులు పలు ప్రశ్నలు వేశారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు.. విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది.