జెరోధా వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ తన భార్య క్యాన్సర్ సోకడం, చికిత్స, కోలుకోవడం గురించి మరోసారి సోషల్ మీడియాద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా టాటా ముంబై మారథాన్‌లో వైకల్యాన్ని చేర్చడంపై సంతోషాన్ని ప్రకటించారు. టాటా ముంబై మారథాన్‌లో పరుగెత్తిన దివ్యాంగులలో ఉన్న ఉత్సాహం, ఉద్వేగం మాటల్లో చెప్పలేనిదని ఆయన ప్రశంసించారు. అన్నీ సవ్యంగా ఉన్నా జీవితంలో ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేసే ముందు ఆలోచించేలా చేస్తుందన్నారు.
అదే సమయంలో తన భార్య క్యాన్సర్ కోలుకున్న తీరు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. క్యాన్సర్ నుండి బయటపడిన తర్వాత దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 57 నిమిషాల్లో 10 కి.మీ పరిగెత్తారని వివరించారు. అలాగే మారథాన్‌లో పాల్గొన్న తన భార్య సీమా కామత్ ఫోటోలతో పాటు, ఆమె రాసిన వ్యక్తిగత బ్లాగుకు వ్యాఖ్యలలో లింక్‌ను పంచుకున్నారు.
ఇదీ చదవండి: నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం
The excitement and enthusiasm among people with disabilities running the Tata Mumbai Marathon today were beyond words. Makes you think about what right you have to complain about anything in life.
On a personal note, Seema (wife, see the link in comments) ran 10km in ~57… pic.twitter.com/8YEDVwf0WE— Nithin Kamath (@Nithin0dha) January 18, 2026
సీమా కామత్ తన బ్లాగులో అందించిన వివరాలు ప్రకారం 2021 నవంబరులో స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ. ఎలాంటి లక్షణాలు, ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే, చాలా క్రమశిక్షణగా, ఫిట్‌గా చాలా ఆరోగ్యంగా ఉండే ఆమె కేన్సర్ బారిన పడ్డారు. సాధారణంగా చేసుకునే ఫుల్ బాడీ టెస్ట్‌లో భాగంగా జరిగిన మమోగ్రామ్ టెస్ట్‌లో ఆమె కుడి రొమ్ములో గడ్డను గుర్తించారు. ఆ తరువాత బయాప్సీ, PET స్కాన్ లాంటి పరీక్షల ద్వారా ఆమెకు క్యాన్సర్ సోకిందని నిర్ధారించారు.
దీంతో తాను షాక్‌కు గురయ్యారు. మొదట కుటుంబ సభ్యులు , కొంతమంది స్నేహితులతో తప్ప మిగతా ఎవ్వరితోనూ దీని గురించి చర్చించలేదు. అదేదో తప్పు అనే భావం ఉండటం వల్లే ఇది జరిగిందనీ, "మానసిక అనారోగ్యంలాగే, క్యాన్సర్ కూడా మన దేశంలో నిషిద్ధం" అని చెప్పుకొచ్చారు. కానీ అవగాహనతో ఉండి, ముందస్తు పరీక్షలతో దీన్ని జయించవచ్చు అన్నారామె.
ఇదీ చదవండి: మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియో
మాస్టెక్టమీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లతో "ఎమోషనల్ రోలర్ కోస్టర్" లా గడించిందన్నారు. ఈ రోజుల్లో క్యేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారణే సాధ్యమే అన్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండే వారు కూడా వైద్యులు రొటీన్ స్క్రీనింగ్ చాలా అవసరమని సీమా రాశారు. తీవ్రమైన అనారోగ్యాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే ప్రతీవవారికి ఆరోగ్య బీమా అవసరమన్నారు. చికిత్స సమయంలో కుటుంబ, సామాజిక మద్దతు ప్రాముఖ్యతను కూడా ఆమె నొక్కి చెప్పారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు మనం చేయాల్సిందంతా చేయాలని సూచించారు.
గతంలో తన క్సేన్సర్ రికవరీ జర్నీగురించి మాట్లాడిన సీమ జుట్టు ఊడిపోవడం లాంటి కీమో థెరపీ కష్టాలను పంచుకున్నారు. ఆ బాధలు భరించలేక చనిపోతే మేలు అనుకునేదాన్నని చెప్పారు. ఈ సమయంలో భర్త నితిన్, తన కొడుకు గుండు చేయించుకొనిధైర్యాన్ని నింపారన్నారు. చికిత్సతోపాటు, ఆహారం, వ్యాయామంతో క్యాన్సర్‌ను జయించానని వెల్లడించారు. వ్యాధినుంచి కోలుకున్న తరువాత క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, ప్రపంచ పర్యటనలు, మారథాన్‌రన్ లాంటి కార్యకల్లాపాలతో బిజీగా ఉంటున్నారు సీమ.


