న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో ఒక నిర్మాణ స్థలంలో ఉన్న నీటి గుంత ప్రమాదంలో యువ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరణానికి కారణంగా భావిస్తున్న కంపెనీ యజమానుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశాడు.
నిర్మాణ పనుల కోసం తవ్విన, నీటితో నిండి ఉన్న గుంతలో తన ఎస్‌యూవీ వాహనం పడిపోవడంతో 27 ఏళ్ల యువరాజ్ మెహతా మృతికి సంబంధించి ఒక బిల్డర్‌ను అరెస్టు చేశారు. విష్‌టౌన్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులలో ఒకరైన అభయ్ కుమార్‌ను అరెస్టు చేశామని, మరో యజమాని మనీష్ కుమార్ కోసం గాలిస్తున్నామని నోయిడా పోలీసులు మంగళవారం ప్రకటించారు.
కాగా గురుగ్రాంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువరాజ్ మోహతా విధినిర్వహణ తరువాత ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నోయిడాలోని సెక్టార్-150లోని ఏటీఎస్ లే గ్రాండియోస్ కూడలి వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి ఓ గోడను ఢీకొట్టి, పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో సహాయక చర్యలు కూడా సకాలంలో అందలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి


