సోషల్ మీడియా, రిల్స్ మోజులో పడి వింత వింత పోకడలు పోతున్నారు. ప్రాణాలు పోతున్నా, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా గడ్డకట్టిన మంచులో రీల్స్ చేయడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చకున్న ఒక మహిళ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా మంచు కురిసే ప్రదేశాలకు వెళ్లడం, అక్కడమంచుతో ఆడుకోవడం సరదాగానే ఉంటుంది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అంటే చలికి తట్టుకోగలిగే ఇన్సులేట్ దుస్తులు ధరించడం, ఎక్కువ సేపు అక్కడ ఉండకపోవడం లాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వెళితే మాత్రం, అందరిలో కాకపోయినా, కొందరిలో సమస్యలు తప్పవు. ఈ వైరల్ వీడియోను పరిశీలిస్తే అదే విషయం అవగతమవుతుంది.
వీడియోతో పాటు షేర్ అయిన వివరాల ప్రకారం, మంచుతో కప్పబడిన ఎత్తైన ప్రదేశంలో ఇద్దరు మహిళలు డ్యాన్స్ రీల్‌ను షూట్ చేస్తున్నారు. ఒకరు ఎరుపు చీరలో, మరొకరు గులాబీ రంగులో ఉన్నారు. వీరిలో ఒకామె చలితీవ్రతకు ఇబ్బంది పడుతున్నమనం చూడొచ్చు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో తల తిరగడం, బ్లాక్‌అవుట్ లాంటి సంకేతాలతో ఇబ్బంది పడింది. ఒక దశలో ఆమె ఏడుస్తూ కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్న వారు స్పందించి సహాయం అందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్
Self-Harm Kalesh (Girl risked her life for reels: shot video in freezing heavy snow wearing almost nothing just for views.
Soon oxygen dropped → started feeling dizzy, severe headache, blackout coming.
Broke down crying in the snow.) pic.twitter.com/jooV7P02uO— Ghar Ke Kalesh (@gharkekalesh) January 18, 2026
దీంతోనె టిజన్లు ఆమె యోగక్షేమాలపై ఆరా తీశారు. ఫాలోయర్లను పెంచుకునేందుకో, లేదా వారిని ఎంటర్‌టైన్ చేసేందుకో ఇలాంటి కంటెంట్‌ను సృష్టించే సందర్భంలో ఆరోగ్య ప్రమాదాలపై ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా చలి లేదా ఎత్తైన ప్రదేశాలకు అలవాటు లేని వారు, ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేని వారు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. .
చలిని నుంచి రక్షించే సరైన దుస్తులు లేకుండా తీవ్రమైన చలికి గురికావడం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో తగినంత రక్షణ లేకపోవడం అనేది అల్పోష్ణస్థితికి దారి తీస్తుందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.


