breaking news
Reel to digital
-
మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియో
సోషల్ మీడియా, రిల్స్ మోజులో పడి వింత వింత పోకడలు పోతున్నారు. ప్రాణాలు పోతున్నా, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా గడ్డకట్టిన మంచులో రీల్స్ చేయడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చకున్న ఒక మహిళ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సాధారణంగా మంచు కురిసే ప్రదేశాలకు వెళ్లడం, అక్కడమంచుతో ఆడుకోవడం సరదాగానే ఉంటుంది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అంటే చలికి తట్టుకోగలిగే ఇన్సులేట్ దుస్తులు ధరించడం, ఎక్కువ సేపు అక్కడ ఉండకపోవడం లాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వెళితే మాత్రం, అందరిలో కాకపోయినా, కొందరిలో సమస్యలు తప్పవు. ఈ వైరల్ వీడియోను పరిశీలిస్తే అదే విషయం అవగతమవుతుంది.వీడియోతో పాటు షేర్ అయిన వివరాల ప్రకారం, మంచుతో కప్పబడిన ఎత్తైన ప్రదేశంలో ఇద్దరు మహిళలు డ్యాన్స్ రీల్‌ను షూట్ చేస్తున్నారు. ఒకరు ఎరుపు చీరలో, మరొకరు గులాబీ రంగులో ఉన్నారు. వీరిలో ఒకామె చలితీవ్రతకు ఇబ్బంది పడుతున్నమనం చూడొచ్చు. ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో తల తిరగడం, బ్లాక్అవుట్ లాంటి సంకేతాలతో ఇబ్బంది పడింది. ఒక దశలో ఆమె ఏడుస్తూ కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్న వారు స్పందించి సహాయం అందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్Self-Harm Kalesh (Girl risked her life for reels: shot video in freezing heavy snow wearing almost nothing just for views. Soon oxygen dropped → started feeling dizzy, severe headache, blackout coming. Broke down crying in the snow.) pic.twitter.com/jooV7P02uO— Ghar Ke Kalesh (@gharkekalesh) January 18, 2026దీంతోనె టిజన్లు ఆమె యోగక్షేమాలపై ఆరా తీశారు. ఫాలోయర్లను పెంచుకునేందుకో, లేదా వారిని ఎంటర్టైన్ చేసేందుకో ఇలాంటి కంటెంట్‌ను సృష్టించే సందర్భంలో ఆరోగ్య ప్రమాదాలపై ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా చలి లేదా ఎత్తైన ప్రదేశాలకు అలవాటు లేని వారు, ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేని వారు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. .చలిని నుంచి రక్షించే సరైన దుస్తులు లేకుండా తీవ్రమైన చలికి గురికావడం తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో తగినంత రక్షణ లేకపోవడం అనేది అల్పోష్ణస్థితికి దారి తీస్తుందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. -
రీల్స్ చేస్తూ.. 'అమ్మా' అని అరుస్తూ గంగానదిలో కొట్టుకుపోయిన మహిళ
ఉత్తరకాశీ: విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. ఇన్‌స్టా రీల్స్ చేస్తున్న ఓ మహిళ నదిలో కొట్టుకుపోయింది. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రకటించారు.పోలీసుల వివరాల మేరకు.. నేపాల్‌కు చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. సరదాగా గడిపేందుకు తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి మణి కర్ణిక ఘాట్‌ను సందర్శించింది. ఉత్తరకాశిలోని గంగానదికి కీలకమైన ప్రవాహమైన భాగీరథి నదిని వీడియో తీయమని తల్లి తన 11ఏళ్ల బాలికకు ఫోన్ ఇచ్చింది. అనంతరం తల్లి నదిలో దిగింది. తల్లి కోరికతో బాలిక ఫోన్ తీసుకుని వీడియో తీయడం ప్రారంభించింది. రీల్స్ చేసేందుకు ప్రయత్నించింది. ఓ వైపు కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ.. అకస్మాత్తుగా నీటిలోకి జారి పడింది. ‘అమ్మా’ అని కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. బలమైన నీటి ప్రవాహానికి మహిళ నదిలో కొట్టుకుని పోయింది. అప్రమత్తమైన పర్యాటకులు అధికారులకు సమాచారం అందించారు. మహిళ జాడ కోసం రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదని తెలుస్తోంది.📍 उत्तरकाशी : मणिकर्णिका घाट पर गंगा नदी में डूबी युवती🌊 रील बनाने के चक्कर में युवती की डूबकर मौत📹 गंगा घाट किनारे रील बनाते समय युवती का पैर फिसला💔 हादसे में युवती की जान गई#Uttarkashi #ManikarnikaGhat #TragicAccident #GangaRiver #ViralReel pic.twitter.com/tPSdCpMyax— भारत समाचार | Bharat Samachar (@bstvlive) April 16, 2025 -
యువతి రీల్స్ చేస్తుండగా పడిన పిడుగు .. ఆపై ఏం జరిగిందంటే?
పాట్నా : రీల్స్‌తో యవత తమ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అయినా సరే లైకులు, కామెంట్లు, షేర్ల కోసం వారి ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. తాజాగా, బీహార్‌లోని సీతామర్షి జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంలో జిల్లాలోని సిర్సియా గ్రామానికి చెందిన సానియా కుమారి వర్షం కురుస్తుండగా టెర్రస్‌పై డ్యాన్స్ చేస్తుంది. ఆ డ్యాన్స్‌ను ఆమె స్నేహితులు ఫోన్లో షూట్ చేస్తుండగా..ఆమె వెనుక పిడుగు పడింది. దీంతో హతాశురాలైన యువతి పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి లంకించుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇటీవల ఓ యువతి ఎత్తయిన భవనం నుంచి కిందకు వేలాడుతూ రీల్స్ దిగింది.అదే బిల్డింగ్‌పై నుంచి ఓ యువకుడు ఆమె చేతిని పట్టుకుని ఉండగా.. ఆ ఇద్దరిని ఇంకో యువకుడు వీడియోలు తీశాడు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆ బిల్డింగ్ ఏ మాత్రం పట్టు జారినా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇలాంటి ప్రమాదకర ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్న యువత మాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం. Bihar: Girl Making Instagram Reels in Rain Miraculously Survives Multiple Lightning Strikes in Sitamarhi, Heart-Stopping Video Goes Viral ...#Sitamarhi | #Bihar | #ReelsinRain | #Lightning | #LightningStrikes | #HeartStopping | #Viralvideo | #Republictv | #Republicworld pic.twitter.com/uZKfkS6ax7— Republic (@republic) June 26, 2024 -
దేశం మారింది! సినిమా మారింది!
రీల్ టు డిజిటల్ వివిధ భాషల్లో ఏటా వెయ్యికి పైగా సినిమాలను నిర్మిస్తూ, 300 కోట్ల పైచిలుకు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్న ఘనత భారతీయ సినీ రంగానిది. ఆదాయం లెక్కల సంగతి పక్కనపెడితే, ఈ రకంగా మనది ప్రపంచంలోని అతి పెద్ద వినోద పరిశ్రమ. స్వాతంత్య్రం అనంతరం ఈ ఏడు దశాబ్దాల్లో భారత సినీ పరిశ్రమలో వచ్చిన నిర్మాణ, సాంకేతిక పరిణామాలు అనేకం. 1913లో దాదాసాహెబ్ ఫాల్కే తీసిన మూకీ ‘రాజా హరిశ్చంద్ర’ తొలి స్వదేశీ కథాకథనాత్మక చిత్రం. అప్పటి నుంచి 1931లో తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ వచ్చే దాకా అన్నీ మాటలు లేని సినిమాలే. 1940 తొలి నాళ్ల దాకా చిత్రీకరణ సమయంలో నటిస్తూ నటీనటులు స్వయంగా పలికిన మాటలు, పాటలనే ఫిల్మ్‌పై రికార్డ్ చేసేసేవారు. ఆ తరువాత డైలాగుల్ని విడిగా రికార్డు చేసే డబ్బింగ్ ప్రక్రియ, ప్లేబ్యాక్ సిస్టమ్ వచ్చేశాయి. ఇప్పుడు మళ్లీ సెట్లో నటిస్తున్నప్పుడే డైలాగ్‌లు కూడా రికార్డు చేసేసే పద్ధతి ‘సింక్ సౌండ్’ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది. నాడు షూటింగ్ అంటే బండ బరువుండే డెబ్రీ, మిచెల్ తరహా కెమేరాలతోనే! నేడు బరువు తక్కువ యారీఫ్లెక్స్ కెమేరాలు, ఒంటికి తగిలించుకొనే ‘స్టడీ కామ్’లు వచ్చాయి. స్వాతంత్య్రం తర్వాత 35 ఎంఎం నుంచి సినిమా స్కోప్, 70 ఎం.ఎం, ఆపైన అద్దాలు పెట్టుకొని చూసే 3డీ సినిమాలు తయారయ్యాయి. డాల్బీ, డీటీఎస్, డాల్బీ ఎట్మాస్ల పేరిట సౌండ్ ఎఫెక్ట్లూ అదిరిపోతున్నాయి. అప్పట్లో సినిమాను ముడి ఫిల్ముపై చిత్రీకరించేవారు. ఎన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించాలంటే, అన్ని ప్రింట్లు తీయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫిల్మ్ అక్కర్లేదు... హార్డ్ డిస్క్ ఉంటే చాలు. డిజిటల్ చిత్రాన్ని శాటిలైట్ ద్వారా థియేటర్లకు పంపి, ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శిస్తున్నారు. నాడు ఊరూరా తిరుగుతూ, డేరాలు వేసి సినిమాలు ప్రదర్శించేవారు. టాకీలొచ్చాకా టూరింగ్ టాకీస్‌లే ఎక్కువ. క్రమంగా పర్మినెంట్ థియేటర్లు వచ్చాయి. 1927లో 309 హాళ్లుంటే... 1947లో సుమారు 2 వేల థియేటర్లుండేవి. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లు, ఐ-మ్యాక్స్‌లు... వెరసి దేశంలో నేడు 14 వేల సినిమా స్క్రీన్స్ ఉన్నట్లు అంచనా.


