యువతి రీల్స్‌ చేస్తుండగా పడిన పిడుగు .. ఆపై ఏం జరిగిందంటే? | Bihar Girl Survived Lightning Strikes While Making Reels on Terrace | Sakshi
Sakshi News home page

యువతి రీల్స్‌ చేస్తుండగా పడిన పిడుగు .. ఆపై ఏం జరిగిందంటే?

Jun 26 2024 10:04 PM | Updated on Jun 26 2024 10:06 PM

Bihar Girl Survived Lightning Strikes While Making Reels on Terrace

పాట్నా : రీల్స్‌తో యవత తమ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అయినా సరే లైకులు, కామెంట్లు, షేర్ల కోసం వారి ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. 

తాజాగా, బీహార్‌లోని సీతామర్షి జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంలో జిల్లాలోని సిర్సియా గ్రామానికి చెందిన సానియా కుమారి వర్షం కురుస్తుండగా టెర్రస్‌పై డ్యాన్స్‌ చేస్తుంది. ఆ డ్యాన్స్‌ను ఆమె స్నేహితులు ఫోన్‌లో షూట్‌ చేస్తుండగా..ఆమె వెనుక పిడుగు పడింది. దీంతో హతాశురాలైన యువతి పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి లంకించుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇటీవల ఓ యువతి ఎత్తయిన భవనం నుంచి కిందకు వేలాడుతూ రీల్స్‌ దిగింది.అదే బిల్డింగ్‌పై నుంచి ఓ యువకుడు ఆమె చేతిని పట్టుకుని ఉండగా.. ఆ ఇద్దరిని ఇంకో యువకుడు వీడియోలు తీశాడు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆ బిల్డింగ్‌ ఏ మాత్రం పట్టు జారినా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇలాంటి ప్రమాదకర ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్న యువత మాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement