రీల్స్‌ చేస్తూ.. 'అమ్మా' అని అరుస్తూ గంగానదిలో కొట్టుకుపోయిన మహిళ | Woman Drowned In A River In Uttarakhand While Filming A Reel | Sakshi
Sakshi News home page

రీల్స్‌ చేస్తూ.. 'అమ్మా' అని అరుస్తూ గంగానదిలో కొట్టుకుపోయిన మహిళ

Apr 17 2025 10:09 AM | Updated on Apr 17 2025 12:31 PM

Woman Drowned In A River In Uttarakhand While Filming A Reel

ఉత్తరకాశీ: విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారింది.  ఇన్‌స్టా రీల్స్‌ చేస్తున్న ఓ మహిళ నదిలో కొట్టుకుపోయింది. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రకటించారు.

పోలీసుల వివరాల మేరకు.. నేపాల్‌కు చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. సరదాగా గడిపేందుకు తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి మణి కర్ణిక ఘాట్‌ను సందర్శించింది. ఉత్తరకాశిలోని గంగానదికి కీలకమైన ప్రవాహమైన భాగీరథి నదిని వీడియో తీయమని తల్లి తన 11ఏళ్ల బాలికకు ఫోన్‌ ఇచ్చింది.  అనంతరం తల్లి నదిలో  దిగింది. తల్లి కోరికతో బాలిక ఫోన్‌ తీసుకుని వీడియో తీయడం ప్రారంభించింది. 

రీల్స్‌ చేసేందుకు ప్రయత్నించింది. ఓ వైపు కెమెరా వైపు చూస్తూ నవ్వుతూ.. అకస్మాత్తుగా నీటిలోకి జారి పడింది. ‘అమ్మా’ అని కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది.  బలమైన నీటి ప్రవాహానికి మహిళ నదిలో కొట్టుకుని పోయింది.  

అప్రమత్తమైన పర్యాటకులు అధికారులకు సమాచారం అందించారు. మహిళ జాడ కోసం రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. అయినప్పటికీ ఆమె  ఆచూకీ  దొరకలేదని తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement