అమ్మాయిలతో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల గలీజు పనులు | Video of Minister Kollu Ravindra Associates at Jewellery Shop Goes Viral | Sakshi
Sakshi News home page

అమ్మాయిలతో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుల గలీజు పనులు

Jul 13 2026 7:38 AM | Updated on Jul 13 2026 8:19 AM

Video of Minister Kollu Ravindra Associates at Jewellery Shop Goes Viral

సాక్షి,మచిలీపట్నం: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు కొందరు యువతులతో కలిసి అశ్లీల నృత్యాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. మచిలీపట్నంలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాపులో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరులు కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఒక ప్రైవేట్ విందును ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేడుకకు కొంతమంది యువతులను సైతం రప్పించారు. మద్యం మత్తులో సదరు యువతులతో కలిసి వీరు అసభ్యకర రీతిలో, అశ్లీల నృత్యాలు చేస్తూ చిందులేశారు.

అశ్లీల నృత్యాల్లో పాల్గొని అడ్డంగా దొరికిపోయిన వారిలో సామాన్యులు లేరు. నేరుగా మంత్రి కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తూ, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే ముఖ్య అనుచరులుగా వీరిని గుర్తించారు.సైదారావు, హితేష్‌, ఆంజనేయులు ఉన్నారు. సదరు జ్యువెలరీ షాపులో వీరు యువతులతో కలిసి చేసిన అశ్లీల డ్యాన్స్‌ల దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ అశ్లీల నృత్యాల వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement