
ముంబై: కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో హృదయ విదారక వీడియో వైరల్‌గా మారింది. హిట్ అండ్ రన్ ఘటనలో భార్యను కోల్పోయిన భర్త, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తన భార్య మృతదేహాన్ని బైక్‌పై తాళ్లతో కట్టి తరలించాల్సి వచ్చింది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఈ కేసులో నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషించింది. మహారాష్ట్ర పోలీసులకు 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకునే అవకాశం కల్పించింది.
మహారాష్ట్ర నాగపూర్‌లో మోర్ఫాటా ప్రాంతానికి సమీపంలో నాగ్ పూర్-జబల్ పూర్ జాతీయ రహదారిపై ఓ ట్రక్కు అమిత్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య గ్యార్సితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో,వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీ కొట్టింది. సంఘటన స్థలంలోనే గ్యార్సి మృతి చెందింది.అమిత్ తన భార్య మృతదేహాన్ని తరలించేందుకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నవారిని సాయం కోసం వేడుకున్నాడు. కానీ ఎవరూ స్పందించకపోవడంతో, తన భార్య మృతదేహాన్ని బైక్ వెనక భాగానికి తాళ్లతో కట్టి, మధ్యప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ దృశ్యాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అది వైరల్ అయింది. పోలీసులు చివరకు అమిత్‌ను ఆపి, మృతదేహాన్ని నాగ్‌పూర్‌లోని మాయో ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
ఈ హిట్ అండ్ రన్ ఘటనలో ఏఐ నిందితుల ఆటకట్టించింది. రక్షాబంధన్ రోజున (ఆగస్టు 9) తాను, తన భార్య గ్యార్సితో కలిసి బైక్‌పై వెళుతుండగా రెడ్ కలర్ ట్రక్.. తన బైక్‌ను ఢీకొట్టిందని, ట్రక్ తన భార్య గ్యార్సిని తొక్కుకుంటూ వెళ్లిందని అమిత్ యాదవ్ పోలీసులకు చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ఏఐని వినియోగించారు. మూడు టోల్ ప్లాజాల నుంచి ఘటన జరిగిన 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సీసీ టీవీఫుటేజీ సేకరించారు. ఆ సీసీటీవీఫుటేజీని కంప్యూటర్ విజువల్ టెక్నాలజీ ఆధారంగా రెండు ఏఐ అల్గారిథమ్‌ను ఉపయోగించారు.
ఏఐ మొదటిగా ఎరుపు గుర్తులు ఉన్న ట్రక్కులను గుర్తించింది. రెండవది ట్రక్కుల సగటు వేగాన్ని విశ్లేషించి అనుమానాస్పద ట్రక్కును గుర్తించింది. ఈ ఆధారంగా ఒక ట్రక్కును గుర్తించి, నాగ్‌పూర్ నుంచి 700 కిమీ దూరంలో గ్వాలియర్-కాన్పూర్ హైవే వద్ద దాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఫలితంగా 36 గంటల్లో పోలీసులు.. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కటకటాల్లోకి పంపించారు.
A 35-year-old man tied his wife's lifeless body to his bike after she was run over by a speeding truck in #Nagpur and his cry for help went unnoticed by passersby.pic.twitter.com/CmuC3F9l9U
— Hate Detector 🔍 (@HateDetectors) August 11, 2025